పుట:Geetham Geetha Total.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12.తే. ఆశ యనుపాశమున బద్ధులగుచుఁగామ
క్రోధపరతంత్రు లగుచును గుటిలజనులు
కామభోగార్థవాంఛను గడు నధర్మ
మార్గమున నర్థ మార్జింత్రు మహిని బార్థ!

13. తే. ఆస్తి యియ్యది యెల్ల నాయార్జనంబె;
కోరినది కోరినట్లు చేకూరు నాకు;
ఈధనం బిది నాయది యింకమీఁద;
మఱియు ధనము గడిరతు నా మహిమచేత.

14. తే. ఏన చంపితి శత్రువు; నితరశత్రు
వులను సహితము వధియింపఁ గలను నేన;
నేన యీశ్వరుండును; భోగి; నేన సుఖిని;
నేన సిద్ధుండ; బలశాలి నేన సుమ్మి.

15. తే. జనులలో భాగ్యవంతుండ సత్కులుండ;
నాకు సము లైనవార లున్నారె భువిని?
మఖ మొనర్తు దానము లిత్తు మహిని హర్ష
మేన పొందుమ ననెడియ జ్ఞానవరులు.

16. తే. పలువిధంబులచిత్తవి భ్రాంతియుతులు
మోహజాలసమావృత మూఢమతులు
విషయభోగప్రసక్త సంపీడితులును
నశుభులై నరకంబున కరుగుచుంద్రు.

17. తే. తమప్రభావమె గొప్పగాఁ దలచుకొనుచు
స్తబ్ధు లై ధనమాన మదములఁబూని
దంభమున నశాస్త్రీయపద్ధతిని జేయు
యజ్ఞమది నామకార్థపు యజ్ఞమగును.