పుట:Geetham Geetha Total.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29.తే. ఎవఁడు గనుఁగొని సమునిఁగా నెల్ల దేహ
ముల వసించెడియీశ్వరమూర్తి నెంచు
వానియాత్మకు మనసుచే బాధ లేదు;
ఉత్త మపదంబుఁ బిదప వాఁడొందఁగలఁడు.

30. తే. సర్వకర్మలు ప్రకృతిచే జరుపఁబడెడి
వనుచు నెవ్వం డెఱుంగునో యట్టివాఁడు
కర్త, యేకార్యమున కాత్మ గాదటంచుఁ
దెలిసికొనఁ గల్గు; సరియైన తెల్వి యదియె.

31. తే. ఎవుడు భూతభేదంబులనెల్ల నొక్క
దానియందలి వనియు, విస్తారములును
దాని వే యంచుఁ దెలియునో వాని కపుడు
బ్రహ్మసాధర్మ్య సంపదఁ బడయఁగల్గు.

32. ఆ. ఆదిశూన్యుఁ డగుచు నవ్యయుండును గుణ
త్రయవిహీనఁ డగుటఁ దనువునందు
నున్న నేమి? కర్మ లొనరింపఁ డాతండు;
అట్టివానిఁ దగుల వవియు బార్థ!

33. ఆ. అఖిలవస్తుజాలమాక్రమించియు సూక్ష్మ
మగుట, నాకసమున కంటు లేదు;
ఆట్లె భూతజాలమందెల్ల వ్యాపించు
నాత్మ దేనిఁగాని యంటకుండు.