పుట:Geetham Geetha Total.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23.తే. పురుషవర్యుఁడ దేహంబుఁ బొంది దాని
కగు నటందురు భోక్త నియామకుండు;
మఱి యుపద్రష్ట యుఁబరమాత్మయు నటంచు
భర్త యనుమంత యనికూడఁ బల్కఁ బడును.

24. తే. ప్రకృతిపురుషుల నీరీతిఁ బరిగణించి
గుణవిశేషము ల్చక్కఁగా గుర్తెఱుంగు
నతఁడు సర్వదా వర్తించు నాతఁడయ్యు
జన్మ మొందఁడు వేఱొండు సవ్యసాచి!

25. తే. ధ్యానయోగంబుచేతఁ గొందరు గడిరత్రు;
సాంఖ్యయోగంబె కొందఱు జనులమతము;
కొంద ఱలకర్మ యోగంబు గొంద్రు, దేహ
మున వసించెడియాత్మను గనుఁగొనంగ.

26. తే. ఈ విధము కొంద ఱెఱుఁగక యితరజనుల
వలన విని యుపాసన చేసి పడయచుంద్రు;
అట్టివారును, శ్రుతిపరాయణులు గూడ,
మృత్యు సంసారమును దాఁటి మెలఁగఁగలరు.

27. తే. అవని, స్థావరజంగమంబైనజంతు
వెయ్యదియునైన నెట నుద్భవించె నన్నఁ
బ్రకృతిపురుషులయొక్క సంబంధముననె
కలుగవలెఁ గాని వేఱొండు గాదు పార్థ !

28. తే. ఎల్ల భూతంబులందుఁ దానీశ్వరత్వ
మును వహించుచు నధికారమున వసించి,
చెడుగు నవి చెందినను, దాను జెడనియాత్మ
కెల్లయెడల సమత్వమే యెంచవలయు.