పుట:Geetham Geetha Total.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

05.తే. మునులవలనను మఱి వేదములవలనను
హేతునిశ్చితవాదసం భూతము లగు
బ్రహ్మసూత్రపదంబుల బహువిధముల
విషయ మిది వర్ణనంబు గావింపఁబడియె.

06. ఆ. భూతపంచకంబు బుద్ధి యహంకార
మును దశేంద్రియములు మూలప్రకృతి
యింద్రియంబుల జనియించెడు విషయముల్‌
మఱియు వీనితోడ మన సొకటియు.

07. ఆ. సుఖము దుఃఖమును నసూయయుఁ గోర్కియుఁ
జేతనాధృతులకుఁ జేరికయును
క్షేత్ర మనఁగ నిట్లు చెప్పంగఁబడెఁ గార్య
సహిత మైన తెఱఁగుసవ్యసాచి!

08. తే. గర్వదంభంబు లనునవి గలుగకుండ
శాంతి నిష్కపటం బహింసయు వహించి
సద్గురులసేవఁ జేసి శౌ చంబుఁ బూని
కలఁత లేనట్టి యాత్మనిగ్రహము గలిగి.

09. తే. విషయసుఖములం దాసక్తి విడిచిపుచ్చి
తా నటన్నభావంబునే తలఁచు కొనక
జన్మమృతిజరారుజ్దుః ఖ సమితి నెల్లఁ
గలుగునవి పోవునవి గాఁగఁ దెలిసికొనుచు.

10. తే. రాగనిర్ముక్తుఁ డగుచు, దారసుతులందు
నర్థగృహముల సంగశూన్యత వహించి
సంభవించెడియిష్ట కష్టముల యెడల
నెప్పుడును సమచిత్తత్వమే చెలంగ