పుట:Geetham Geetha Total.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34.తే. నిహతులుగఁ జేసి నే నట నిల్పియున్న
శంతనుసుతుండు ద్రోణుండు సైంధవుండు
సూతతనయుండు మొదలైన శూరవరుల
నని జయింపుము, యశము రాజ్యంబుఁ గొనుము.

అర్జునుడిట్లనియె :-

36. తే.జగము నీకీర్తి గని సంతసంబుఁ జెందె
భయము జనియించి రాక్షసుల్పరుగు లిడిరి
సిద్ధు లెల్లరు మ్రొక్కిరి చే మొగిడ్చి
లోకనాయక! యీరీతి నీకె తగును.

37. ఆ.పద్మగర్భుఁడేల ప్రణుతి సేయతయుండు
నతని కాదికర్తవైన నీకు;
అక్షరంబు సత్తునట్లె యసత్తు త
త్పరము నీవ యగుదు పరమపురుష.

38. ఆ.ఆదిదేవుఁడవును నఖిలలోకాధారుఁ
డవును మూలపురుషుడవును నీవె;
విశ్వమయుఁడ వీవె; వేత్తయు వేద్యుండ
వీవె; పరమపదము నీవె కృష్ణ!

39. ఆ.వాయు వగ్ని యముఁడు వరుణచంద్రులు బ్రహ్మ
బ్రహ్మతండ్రి వీవె పరమపురుష !
మ్రొక్కువాఁడ నీకు మ్రొక్కెద వేమాఱు
మ్రొక్కువాఁడ మఱియు మ్రొక్కువాఁడ.