పుట:Geetham Geetha Total.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29.ఆ. ప్రజ్వలించునగ్ని బహుపతంగంబులు
వడి వినాశమునకుఁ బడినయట్లు
నరసమూహములు వినాశంబునకు నీము
ఖాగ్నిఁ దఱియఁజొచ్చి రదిగొ దేవ!

30. ఆ. అఖిలజగతి జనుల నాస్వాదనము సేయు
చుంటి నీముఖాగ్ని మంటఁ గలియ;
నీకిరణములందె నిబిడీకృతంబుగా
భువనములు తపించి పోవుచుండె.

31. ఆ. ఎవఁడ వీవు దేవ! యీయుగ్రరూపం బ
దేల? యాదికర్త వీవు గావె?
నీప్రవృతి దెలుపు నీరజాక్షా! నమ
స్కారముల నొనర్తుఁ గరుణఁ గనుము.

శ్రీ భగవంతుడిట్లనియె :-

32. తే. కాలమును నేనెకనుక లోకమున కెల్ల
క్షయము గలిగింప వృద్ధిjైు సంచరింతు;
అరుల కెట్లేనిఁ గల్గు సంహార మిపుడు;
నీవు లేకున్న నీపని నిల్వఁబోదు.

33. తే. కనుక లెమ్మింక శత్రుమర్ధనముకొఱకు
జయము లభియించు, యశము రాజ్యంబు గల్గు
వార లింతకె నాచేతఁ బడిరి, నీవు
రణము సలుపు, నిమిత్తమాత్రముగఁ బార్థ!