పుట:Geetham Geetha Total.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40.తే. అంతమున్నదె? కల్యాణ వంతము లగు
నావిభూతుల వర్ణింప నమ్రచరిత!
విస్తరింపక నేను జెప్పితిని నీకు
ముఖ్యమైనవి సంగ్రహముగను నేఁడు.

41. ఆ. భూతజాలమున విభూతిమంతంబును
గాంతికరమును శుభకార్యకరము
నేది గలదొ యట్టి దెల్లను నా తేజ
సంభవంబు: నిజము: సవ్యసాచి!

42. ఆ. ఇట్లు గానియెడల నేమిప్రయోజనం
బేను నీకు దీని నెఱుఁగఁ జెప్పి
మహితజగము నాదు మహిమమం దణుమాత్ర
ముననె నిల్చుచుండునని యెఱుంగు.


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

పదియవ అధ్యాయము విభూతియోగము సమాప్తము.