పుట:Geetham Geetha Total.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35.తే. సామగానంబులను బృహత్సామ మేన;
అఖిలఛందబులందు గాయత్రి నేన;
మార్గశిరమాసమును నేన మాసములను
ఋతువు లన్నిటను వసంతఋతువు నేన.

36. తే. వంచకుల కెల్ల నే ద్యూత వంచనమును;
సర్వతేజస్యులందుఁదే జంబు నేన;
సాత్త్వికులయందు విలసిల్లు సత్త్వ మేన;
జయమగుదు నేన; మఱి వ్యవ సాయ మేన.

37. తే. వాసుదేవుండ యాదవ వంశమందు;
అర్జునుండను నేఁ బాండవాన్వయమున;
వ్యాసుఁడను నేన యెల్ల సంయములయందు;
కవిజనంబులలో శుక్రకవిని నేన.

38. తే. దండనము సేయువారి దౌదండమేన;
దిగ్విజయులకు రాజనీతియును నేన;
గోపనము లన్నిటను మౌనగుణము నేన;
జ్ఞానవంతులపాలిటి జ్ఞానమేన.

39. తే. సర్వభూతంబులకును బీజంబు నేను
గాన, తజ్జన్మములకే నఁ గారణమను;
నేను లేనట్టి భూత మేదేని లేదు;
జగతిలోపలఁ గల చరాచరములందు.