పుట:Geetham Geetha Total.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23.తే.రుద్రులం దెల్ల నే శంకరుండ నగుదు;
యక్షరక్షసులందలకాధిపతిని;
పావకుండను నే సర్వ వసువులందు;
శిఖరధరములలో మేరుశిఖరి నేన.

24. తే. అలపురోహితులందు బృహస్పతియును
నేన యగుదును; మఱియును మాననీయ!
సర్వసేనానులందు నే షణ్ముఖుండ;
సరసులం దెల్ల నే సుమీ సాగరుఁడను.

25. తే. భృగుమహర్షిని ఋషులలో నగుదు నేను;
శబ్దములలోన నోంకారశబ్ద మేన;
యజ్ఞములయందు జ్ఞాన యజ్ఞ మగుదు;
అద్రులందు హిమాలయ మగుదు నేను.

26. తే. సర్వవృక్షంబులందు నశ్వత్థ మేన;
పార్థ ! నే నారదుఁడను దేవర్షులందు;
చిత్రరథుఁడను గంధర్వ సేనలందు;
కపిలముని నేన సిద్ధులౌ జ్ఞానులందు.

27. తే. అశ్వములయందు నేన యుచ్చైశ్శ్రవంబ
నగుదు నమృతముతోఁబుట్టినందువలన;
అగుదు నై రావతంబ నే నుఁగులయందు;
మనుజులందు నే నౌదును మనుజపతిని.

28. తే. ఆయుధంబుల వజ్రంబనగుదు నేను;
ధేనువులయందు నేఁ గామధేను వగుదు;
జననకారకులందు నే స్మరుఁడ నగుదు;
వాసుకిని నేనయగుదు సర్పములయందు.