పుట:Geetham Geetha Total.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

06. తే. వాయు వేరీతి శూన్యనభంబునందు
సంచరించును నిల్చు నా శక్తివలన,
అట్లె నను సర్వభూతంబులాశ్రయించు;
అన్నిటికి నేన యాధారమగుదు సుమ్మి.

07. తే. ప్రళయకాలంబునందు నా ప్రకృతియందె
భూతజాలము ల్లీనంబు పొందుచుండు;
వానినెల్లను మరలఁ గల్పాదియందు
నేన సృజియించు చుండెద నిర్మలాత్మ !

08. తే. నాడు ప్రకృతికిఁ దా మధీనములు గాన
భూతముల కస్వతంత్రత పొడమియుండు;
మరలమరలను బుడమి జన్మము లొసంగి
వాని సృజియించు చుందు నాప్రకృతిఁబూని
.
09. ఆ. అట్టికర్మముల ననాసక్తి వహియించి
నేఁ దటస్థుడనుగ నిలిచియుందు;
కనుక నాకు బంధకములు గాఁజాలవు
జగతియొక్క ప్రళయ సంభవములు.

10. ఆ. అవని నేను బ్రకృతికధ్యక్షత వహింప
జగతిఁ గలుగు భూతజాల మెల్ల;
నట్టిహేతువుననె యర్జునా! జగము చ
క్రంబువోలెఁ దిరుగఁగలుగు నెపుడు.

11. తే. సర్వభూతంబులకు మహేశ్వరుఁడ నయ్యు
నరశరీరంబు ధరియించు నన్నుఁజూచి
నాదు శ్రేష్ఠత్వ మెఱుఁగని నరులు మూఢు
లగుచు న న్నవమానింతు రనఘచరిత !