పుట:Geetham Geetha Total.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29. తే. జగతి నీజరామరణ మోక్షంబుకొఱకు
నేన యాధార మనుచు యత్నింతు రెవ్వ
రట్టిపూరుషు లవలీల నరయఁగలరు
బ్రహ్మ మధ్యాత్మ మఖిలకర్మములు పార్థ !

30. తే. భూతముల కెల్ల నాధారభూతుఁడ నని
దేవదేవుఁడ ననియును దెలిసి, సర్వ,
యజ్ఞములు నాకె చేరు నంచరయువారు
గాంచుచుందురు న న్నంత్యకాలమునను.



బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

ఏడవ అధ్యాయము విజ్ఞానయోగము సమాప్తము

.