పుట:Geetha parichayam Total Book.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భగవద్గీత అని తెల్పుచున్నాము. త్రైత సిద్ధాంతము ముఖ్యముగ మూడు ఆత్మల వివరమును గురించి చెప్పుచు పోయినది. త్రైతమనిన, మూడు ఆత్మలనిన చదువు వారికి క్రొత్తగ ఉండును. కావున ముందే "గీతా పరిచయము"ను చూడవలసిన ఆవశ్యకత గలదు. ఎందుకనగా ఒక క్రొత్తవానిని మనము నేరుగ పలకరించలేము. వానితో స్నేహము చేయలేము. క్రొత్త వ్యక్తిని పరిచయము చేయడానికి మొదట ఒక మధ్యవర్తి ఉంటే వానితో సులభముగ పరిచయము ఏర్పడగలదు. మధ్యవర్తి యొక్క తెలివినిబట్టి, వాడు తెలిపే దానినిబట్టి, క్రొత్తవాని విషయమంతా మనకు ముందే అవగాహన కాగలదు. ఆ తర్వాత వానితో సులభముగ కలసిమెలసి పోవచ్చును. అలాగే త్రైత సిద్ధాంత భగవద్గీతలోని సారాంశము తెలియాలంటే, దాని అవగాహన కావాలంటే, ముందు గీతా పరిచయమను మధ్యవర్తి కావలసిందే. 'గీతాపరిచయము' ను చదివిన తర్వాత 'త్రైత సిద్ధాంత భగవద్గీత' అను సరిక్రొత్త గీత అర్థము కాగలదు. ఈ గీతాపరిచయము మిమ్ములను త్రైతముతో పరిచయము చేయించి, త్రైతమంటే ఏమిటో తెలుపగలదు. గీతాపరిచయమును చదివిన తర్వాత మాచే రచింపబడిన "తైత సిద్ధాంత భగవద్గీత" ను చదవగలరని కోరుచున్నాము.

-***-


అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,

సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.