పుట:Ganita-Chandrika.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ తరగతి.

33


సామాన్య సంఖ్యలను హెచ్చించిన విధముననే దశాంశ భిన్నములను హెచ్చించవచ్చును.

అభ్యాసము 11.

ప్రశ్నలు:-

(1) 1. 6 అం. పొడవుగల 9 తునకలను చేయుటకు ఎంతపొడవు దారము యుండవలయును? 9x1.6 అం.

(2) గంటకు 1.5 మైళ్ల చొప్పున 7 గంటలకు ఎన్ని మైళ్ళు నడవవచ్చును ?

(3) దినమునకు 4.3 పుటలు చొప్పున 13 దినములలో ఎన్ని పుటలు చదువవచ్చును ?

(4) రూపాయకు 2.1 గజము చొ॥ 15రూపాయలకు ఎన్ని గజములు గుడ్డవచ్చును?

(5) తలగడకు 1.2 వీశెల దూది చొప్పున 17 తలగడలకు ఎంత దూది కావలయును?

4.8 అంగుళముల పొడవుగల త్రాటిని రెండు సమాన భాగములు చేసిన భాగము పొడ వెంత ?

4 అంగుళములలో సగము 2 అంగుళములు.
8 దశాంశములలో సగము 4 దశాంశములు.
మొత్తం 2.4 అం.