పుట:Ganita-Chandrika.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

నాల్గవతరగతి.


పైన పధకము వ్రాయని ఎడల ఏ 4 పస్థానమును తెలుపునది తెలియదు. పధకము వ్రాయక నే తెలుపుటకు భిన్న భాగమును తెలుపుటకు ఈ విధముగ వ్రాయుచున్నారు.

444.4

పైనవ్రాసిన సంఖ్యలో , ఈ చుక్కకు కుడి వైపు భాగము భిన్న భాగము, ఎడమవైపు భాగము పూర్ణాంక భాగము. ఈ . చుక్కకు ఎడమ వైపున నున్న 4 ఒకట్ల స్థానమున నున్నది. ఈచుక్కను దశాంశ బిందువు లేక దశాంశ పుచుక్క అందుము.

ఈచుక్కకు కుడి వైపు స్థానము దశాంశ స్థానమున ఏ అంకెయుండిన అన్ని దశాంశములు అనియర్ధము.

7.3 గజములు అనగా ఏడు గజములును, గజమును 10 సమభాగములు చేసి అందు 3 భాగములును అని అర్ధము.

దశాంశ స్థానమునకు కుడి వైపు స్థానము ఏదిగ నుండ వలెను? దశాంశములో పదియవ వంతుగాన శతాంశ స్థానము. ఈ స్థానమున ఏఅంకెయుండిన అన్ని శతాంశములు అని తెలియవలయును.

3.24 గజములు అనగా ఆ గజములును, గజమును 10 భాగములు చేసిన 2 భాగములును, గజమును 100 భాగములు చేసిన 4 భాగములును అని యర్థము ?