పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశిష్టతలూ, చారిత్రక నేపధ్యం

ప్రాకారో జయతి త్రికూటమ్ అభితస్థత్ తేన నిర్మాపితః
సుశ్లిష్టైః క్రమశీర్షకై రుపచితో నీలోపలై: కల్పితః|
యశ్చా లక్షిత సంధిబంధ కథనాదేకాశిలా తక్షకైః
సంతక్ష్యేవ మహీయసీమ్ ఇవ శిలాం యత్నాత్ సముత్తారితః ||

నల్లని రాళ్ళను సమానంగా నున్నగా చెక్కి, సన్నిహితంగా కూర్చి నిర్మించిన త్రికూట ప్రాకారం విలసిల్లుతూ ఉంది. అతుకుల గీతలు కనిపించకుండా ఏకశిలా నిర్మితంగా భాసించే ఈ ప్రాకారాన్ని మహాప్రయత్నంతో శిల్పులు నిర్మించారు అంటూ గణపతిదేవుని కాలంనాటిదయిన కొండపర్తి శాసనం చెపుతోంది. ఇలా కాకతీయుల నిర్మాణ ప్రతిభకు అద్దంపట్టే వారికాలంనాటి గొప్పనిర్మాణమే ఈ కూసుమంచి గణపేశ్వరాలయం.

గుడి అంటే కేవలం ఆరాధనకు, మొక్కుబడులు చెల్లించుకునేందుకే కాదు. అంతకంటే ముఖ్యమైన సామాజిక క్షేత్రంగా పనిచేసిందని సమాజానికి తప్పనిసరి అవసరంగా గుడి వుండేదని కె.ఏ.నీలకంఠశాస్త్రి గారు చెప్పిన మాటలు ఇక్కడ ఇప్పుడు మరోసారి గుర్తుచేసుకోవాలి.

భూస్వామిగా, యజమానిగా, సరుకులు – సేవల వినియోగదారుగా, బ్యాంకుగా, పాఠశాలగా, వస్తుప్రదర్శనశాలగా, వైద్యాశాలగా, రంగస్థలంగా, ఒక్కమాటలో చెప్పాలంటే అత్యుత్తమమయిన కళలూ నాగరికతలకు సంభందించి కేంద్రబిందువుగా, ధర్మభద్ధమైన మానవతతో వాటిని నియంత్రించేదిగా మధ్యయుగ దేవాలయంతో సమానమైన వేవీ మానవ చరిత్రలో లేవు

గొప్ప చరిత్రకారుని మాటల్లోని నిజం మనకి అర్ధంకావాలంటే శాతాబ్ధాల కాలాన్ని ఎదురొడ్డి నిలచిన ఇటువంటి దేవాలయాలను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వ్యవస్థకు భరోసానిస్తూ బలోపేతం చేసుకునే పద్దతులను ఈనాటి విధానికి సరిపడేలా ఏర్పాటుచేసుకోగలగాలి.

ఆంధ్రదేశంలో 300 సంవత్సరాలకు పైగా సాగిన కాకతీయుల పరిపాలన అంటే