పత్రికలవారు కొంత భాగమైనను సరళ గ్రాంథిక రచనలకు కేటాయించి, ప్రజలకు పూర్వవాజ్మయముతో సంబంధము తెగకుండునట్లు చేయుట ఆవశ్యకము.
25-2-1927 తేది హైదరాబాదులో ఆదిహిందూసంఘము వారు (హరిజనులు) శ్రీ మాడపాటి హనుమంతరావు గారి గృహము నుండి నాయనను పల్లకిలో ఊరేగించుచు వారి హాస్టలునకు తీసికొనిపోయి "ముని" బిరుదము నిచ్చి సత్కరించిరి. సమ్మాన పత్రమును భాగ్యరెడ్డి గారు చదువగా వామన నాయక్ గారు శాస్త్రిగారికి సమర్పించిరి.[1]
1927 జూలైలో నాయన మరల అరుణాచలమున చూత గుహకు చేరెను. శ్రీఅరవిందుడు శ్రీమాతయందు "కాళి" యొక్క అవతరణమును సాధించెనని ఆమె దివ్యశక్తులను కపాలి నాయనకు వర్ణించి చెప్పి తన చర్యను సమర్థించుకొనెను. కాని నాయన కపాలి అభిప్రాయములను అంగీకరింపలేదు.
1927 డిసెంబరులో చెన్నపురములో జరుగుచున్న పండిత సభకు నాయనకు ఆహ్వానము వచ్చెను. అది నిమిత్తముగా నాయన చెన్నపురమునకేగెను. ఆ పండితసభవారు వాసిష్ఠుని ఆదరింపలేదు.
- ↑ * జయంతి సంచిక - ఆదిహిందువు లిచ్చిన సమ్మానము - శిరుగూరి జయరాం - పుట - 3