పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. కపాల భేదసిద్ధి

1922 ఏప్రిలులో నాయన అరుణాచలమునకు వచ్చెను. చూతగుహకు ముందు గది నిర్మాణము మరమ్మత్తులు జరుగుచుండగా నాయన ఉమా సహస్రమును సంస్కరింప మొదలిడెను. అది ఏడవ సంస్కరణము. పిదప ఆయన ఇరువది రోజులలో దీక్షగా ఇంద్రాణి సప్తశతిని రచింపవలెనని సంకల్పించెను. కాని రచనము ఆరంభము కాకముందే నాయనకు తీవ్రమైన శిరోబాధ కలిగెను. రెండుదినములు సుమారుగా నుండి మూడవదినము రాత్రికి గొడ్డలితో కొట్టుచున్నంతగా బాధ కలిగెను. దానితోపాటు వెన్నులోనుండి కంఠము పర్యంతము దుర్భరమైన తాపము బయలుదేరెను. నాయన మహర్షి యొద్దకు పోలేక చీటి పంపెను. మహర్షి మౌనము వహించెను.

అర్ధరాత్రి యగునప్పటికి నాయన శిరస్సునుండి "టప్" అను శబ్దము గుహ వెలుపల కూర్చుండిన విశాలాక్షమ్మకు వజ్రమ్మకు వినబడెను. వారు మిగుల భయపడ జొచ్చిరి. వెంటనే చంద్రకాంతివంటి జ్యోతి ఆయన శిరస్సు నుండి వెడలి గుహయొక్క కప్పుపై బింబాకారముగా పడి గుహలోని చీకటిని తొలగించెను. దానితోపాటు ఆయన శిరస్సునుండి ఆవిరివంటి పొగ వెలువడ జొచ్చెను. అప్పుడు నాయన "అమ్మయ్య" అని నిట్టూర్చి, "శీర్షకపాలములు రెండును భిన్నమగుటకే ఇంత బాధ కలిగినది; అవి భిన్నమైనవి! బాధ పోయినది" అని చెంత నున్నవారితో చెప్పెను. తెల్లవారు నప్పటికి శిరస్సునుండి పైకి వచ్చుచున్న