పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


14-3-1931 తేది నాయన "ఉన్నది నలువది" అను గ్రంథమును సద్దర్శనముగా సంస్కృతము లోనికి అనువదించి, జూన్ నెల చివరకు "ప్రచండ చండీత్రిశతి" అను స్తోత్ర గ్రంథమును ఈశోపనిషత్తునకు లఘుభాష్యమును రచించెను.

శ్రీ ఆర్యసోమయాజుల అప్పన్నశాస్త్రి సద్దర్శనములోని రచన యొక్క ప్రాశస్త్యమును ఇట్లు నిరూపించెను. "వీరి యనువాదములో పాదపురాణము కొఱకు ఒక్క వ్యర్థాక్షరమైనను మచ్చునకైనను కానరాదు. జటిల సమాసములు లేనే లేవు. పదములు అర్థమును భోధించుటలో ప్రసాద గుణభరితములై యున్నవి. ఒక్క పదమును కూడ మార్చుట కవకాశము లేదు. చిక్కనైన శైలితోను మృదు మధురములగు పదములతోను భావ గాంబీర్యముతోను, ప్రకాశించు ఈ గ్రంథము శ్రుతి సమ్మతమైన అద్వైతామృతమును మనకు అందించు చున్నది."[1]

1933 లో నాయన ఋగ్వేదమును మథించి భారతేతిహాసము నందు వర్ణింపబడిన చరిత్రను విమర్శించుచు 'భారత చరిత్ర పరీక్ష' అను పెద్ద గ్రంథమును రచించెను. ఆ గ్రంథములోని ప్రథాంశములను కొన్నింటిని శ్రీ గుంటూరు లక్ష్మీకాంతము ఇట్లు సంగ్రహించెను. "భారత కథకు చెందిన మహావీరు లందఱు శ్రీకృష్ణునితో సహా ఋగ్వేద మందు మంత్రదష్టలుగా నుండుట, వారు తపస్సంపన్నులైనను దేశము కొఱకు యుద్ధము సల్పి ధర్మమును కాపాడుట

  1. * జయంతి సంచిక - సద్దర్శన సమీక్ష పుట 38