పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67

పచ్చల తాడిపర్రు

కైఫియ్యతు మౌజే పచ్చలతాడిపర్రు సంతు వుంన్నూరు ముత్తు౯జాంన్నగరు

తాలూకే సత్తినపల్లి.

యీ గ్రామంలో పూర్వం తాడిపర్రు అనే నామం కల్గి తదనంత్తరం రవలు సానల పనిచేశే కంస్సాలలు వచ్చి యీ గ్రామంలో నివాసం చేశి పచ్చల సానబట్టి యిలాగ్ను కొంన్ని దినములు జర్గినందున బహు దేశముల నుంచ్చి పేరుబడి పచ్చల తాడిపర్రు అని యీ గ్రామాన్కు పేరు వచ్చినది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహ రాజులుంగ్గారు ప్రభుత్వమంద్దు వీరి ప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శా ౧౦౬२ శక (1145 AD) మంద్నుగు రక్తాక్షి సంవ్వత్సరమందు బ్రాహ్మణుల్కు మిరాశి స్నదులు వ్రాయించ్చి యిచ్చే యడల యీ పచ్చలతాడిపర్రుకు కౌండిన్యసగోత్రికులు తాడిపత్తి౯ వారి సంప్రతి భారద్వాజ సగ్రోతికులయ్ని శింగ్గంపల్లి వారి సంప్రతి ౧ వెరశి రెండు సంప్రతుల వారికి ఆరువేల వారికి మిరాశి నిన౯యించ్చినారు గనుక గ్రామస్తులు యీ గ్రామంలో బ్రంహ్మేశ్వరస్వామి వారనే లింగ్గమూతి౯ ప్రతిష్ఠ చేశి ఆలయం కట్టించ్చినారు శ్రీ గోపాల స్వామి వారిని ప్రతిష్ఠ చేశి ఆలయం కట్టించ్చినారు వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వములు జరిగిన తర్వాతను మొగలాయి ప్రభుత్వములు జర్గె యడల యీ కొండ్డవీటి శీమ సముతు బంద్దీలు చేశే యడల యీ గ్రామం పొంన్నూరు సముతులో చేచి౯ యీ గ్రామాన్కు దాసరి శింగ్గం నేడు అనే కంమ్మవార్ని చౌదరిగా నిన౯యించ్చినారు. గన్ను సముతు ఆమీల పరంగ్గా గ్రామం యొక్క చౌదరి కరణాల సుధావారి కిందను అమాని మామిలియ్యతు జర్గించ్చె యడల దేశాన్కి మహత్తైన క్షామం సంభవించ్చినంద్ను గ్రామంలో వుంన్నా దేవస్తళముబ్కు అచ౯ నాదులు జర్గిక అంతర్వుపడ్డవి. స్న ౧౧౨౨ (1712 AD)లో కొండవీటి శీమ జమీందాల౯కు మూడు వంట్లు చేసిపంచ్చిపెట్టేయడల యీ గ్రామం పొంన్నూరు సముతు ౨౮ గ్రామములు వెంక్కంన్న మజ్ముదారు గారి వంట్టులో వచ్చి చిల్కలూరిపాడు తాలూకాలో దాఖలయినంద్ను తదారభ్యా వెంక్కంన్నగారు అప్పాజీపంత్తులు గారు వెంక్కట్రాయునింగారు, వెంక్కట క్రిష్ణునింగారు ప్రభుత్వములు చెశ్ని తర్వాతను, వెంక్కట కృష్ణునింగ్గారి కుమాళ్ళు అయ్ని నర్సంన్నగారు ప్రభుత్వము చేస్తూ వుండ్డగా వెంక్క టేశంగారు తాలూకా చేరి సఖంగా పంచ్చు కునే యెడల యీ గ్రామం నియమోలు (నిడుబ్రోలు) వంట్టులో దూరి ముఠాలో చేరి పద్నాల్గు వూళ్ళల్లో కలిపి సత్తినపల్లి తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు విళంబ్బి సంవత్సరం మొదలుకొని ఆనంద్ద సంవత్సరం వరకు అధికారం చేశ్ని తరువాతను వెంక్కటేశం గారి