పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. అప్పాపురం - కథ

కయిఫియ్యతు మౌజే అప్పాపురం పరగణె వినికొండ్డ రాజా మల్రాజు వెంక్కటగుండ్డా రావు సరుదేశముఖు మంన్నెవారు సర్కారు మృర్తు జాంన్నగరు.

యీ అప్పాపురాన్కు కరణాలు అయ్ని బ్రంహ్మాండం వారు ఈ గ్రామం యేర్పడ్కముంద్దు రేటూరురు పూర్వం గజపతి గణపతి గారి మహాప్రధానులయి గోపరాజు రామంన్నగారి వల్లనుంచ్చింన్ని శాలీవాహనం 1067 శక (1145 AD) మంద్దు ప్రతిగ్రహించబడినటువంటి కరిణీకపు మిరాశి కలవారు సదరహి గజపతివారు. వీరి తరుణమంద్దు రెడ్లు అధికారం చేశ్ని తర్వాతను నరపతి శింహ్వాసనస్తుడయ్ని కృష్ణదేవ మహారాయలు పునహ గజపతి వారిని జయించ్చి శాలివాహనం 1437 శకం (1515 AD) లగాయతు రాజ్యం చేస్తూ వుండి తమ పట్టాన్కు మహాప్రధానులయ్ని తిమ్మర్సుగార్కి అగ్రహారం యివ్వవలస్నివారై వినుకొండ శీమలో చేర్ని రేటూరు పొలంలో కు 20 మరింన్ని కొండ్డపాటూరి గ్రామం పొలంలో 20 కొండ్డవీటి శీమలో చేర్ని కాకుమాని గ్రామంలో పొలం 20 కుమ్మమూరి పోలంక్కు 8 వెరసి 68 కుచ్చళ్ళు పొలంము సదరహి గ్రామాదుల పొలంలో విడతీయించ్చి వేరే గ్రామం చేయించి పొలిమేర హద్దులు నిర్నయించ్చి యీ గ్రామాన్కు అప్పాపురం అని పేరు పెట్టి మొఖాసాగా యిచ్చినారు గన్కు తదారఖ్యా అప్పాపురమని వాడికె వచ్చినది. సదరహి తిమ్మరుసు గారిని కృష్ణరాయులు అప్పా అని పిలిచేవారు గన్కు యేతంన్నిమిత్త్యం వల్లనుంచ్చిన్ని ప్రియం చేతను అప్పాపురమని అన్నారు.

శా 1500 శకం (1578 AD) వర్కు వడ్డె రెడ్డి కర్నాటక ప్రభుత్వములు జరిగినతరువాత మజుకూరి మిరాశి దారుడయ్ని బ్రంహాండ్డం దివాకరుడు ప్రభాకరప్ప యిద్దరు అన్నదంమ్ములు యీ గ్రామంలో విష్ణుస్తలం కట్టించ్చి శ్రీ వేణుగోపాలస్వామి వారిని ప్రతిష్ఠ చేశినారు. నారాయణాచార్లు అనే విషునుసుంణ్ని పూజించడాన్కు నిర్కాయించి నిత్యనైవేద్య దీపారాధనలు జరుగగలందుకు కు 15 భూమి యినాము యిప్పించ్చి అఖండదీపారాధనకు గ్రామఖర్చులో జరిగేటట్టు చేశినారు.

యితని కొమారుడయ్ని పేర్రాజు శివాలయం కట్టించ్చి భీమలింగ స్వామి అనే లింగమూర్త్తిని ప్రతిష్ఠ చేశి అర్చన చేయడాన్కు అచ్చన అనే తపోధనుణ్ని నిర్నయించ్చి నిత్యనైవేద్యదీపారాధనలకు జరుగగలంద్లుకు కు 210 భూమి యినాము యిప్పించ్చినారు.

శా 1502 శకం (1580 AD) లగాయతు మొగలాయి ప్రాబల్యమాయగన్కు దేశముఖ దేశపాండ్యా మొదలయ్ని బారాముతస్సద్ది హూదాలు నిర్నయించ్చి అమీళ్ళ పరంగ్గా అమాని మామిలియ్యతు జరిగించినారు.