పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామ కైఫియ్యత్తులు

60


వుంచ్చవలసింద్ది అని చెప్పినంత్తలో వారు వుంన్న జాగాకు వత్త౯......పిలుపించ్చి మీరు యిక్కడ వుండ్డె స్వామి వార్కి ఆచ౯కత్వం చేయవలెనని చెప్పినంత్తల్లో వారు చెప్పిన సంగ్గతి మేము ఆ పుత్రికులము మాకు సంత్తానం లేని విధం చాతను గంగ్గా యాత్రకు పోవలెనని విచారించ్చి బహు దేశములయందుండి వచ్చినాము గన్కు యిక్కడ యెలాగ్ను వుంటాము అంన్నారు. గన్కు రాజువార్ని....... చేసి వేయించ్చి డాన్కు చాలా.....…...........విచారణియ్యుడై యుండెను. తదనంతరం శ్రీ స్వామి వారు ఆయుత్తారి వారి కలలో పచ్చి వెల్గపండ్డు యిచ్చి మీకు సంత్తాన ప్రాప్తి అవుతుంద్ది యింద్కు సంద్దేహం లేదు. ఆచ౯కత్వాన్కి వప్పుకొంమ్మని చెప్పే గన్కు అంత్తట పూజ చేస్తూ వుండ్డగా ఆ యిద్దర్కి నలుగురు కొడుకులు కలిగిరి.

పెదభావయ్య చిన భావయ్య ౧ పరాశరయ్య నారాయణయ్య యీ ప్రకారం క్రమేణ నల్గురు కొమాళ్ళు గలిగిరి గనుక పెద్ద భావయ్య సంత్తతివారు పెద్దింట్టి వారనింన్ని చ్ని భావయ్య సంత్తతివారు నడిపించ్చేవారనింన్ని పరాశరయ్య సంతతివారు పరాశరం వారని నారాయణయ్య సంతత్తివారు నారాయణం వారు అని నాల్గు భాగంలు యేప౯రచుకొని అవి చిత్తుగా యీ స్వామి వార్కి ఆచ౯కత్వం జర్పుతూ వచ్చినారు యిప్పుడుంన్నూ వారి.................క బె అస............ప్రాథ౯న చేస్తూ.........వుంన్నారు.

సదరహి..........న్ని అనే మశీమాధి పతియైన నంద్దెల నారీప రాజు గారు స్వామి వార్కి ఆలయ ప్రాకార మంట్టపములు కట్టించ్చి వుత్సవములు జర్గెటటు కట్టడి చేశి ఆట భాననారాయణస్వామి వారి ప్రభావం వల్లను తేజోవంత్తడై తిర్గి త్న దేశాన్కు పోయా....ట్ట వాడై నాడు.

తదనంతరం కుళోత్తుంగ చోళయదేవ మహారాజులు యీ............లు యావత్తు అతిక్రమించ్చి ప్రభుత్వం చేస్తూ యీ స్తళాన్కి వచ్చి శాలివాహన శక వరుషంబ్బులు ౧౦౮౧ (1159 AD) అను త్ర.. ...మీ సహోధ్యక్షు సాక్షిగా వచ్చిన భావనారాయణ దేమున్కి శా సాధె....... .....న వైశాఖ తీరుకోళ్ళకుంన్ను అచ౯కత్వాన కుంక్ను స్థానికులుంన్ను ఆంగ్గరంగ్గ వైభవాలుంన్నూ యిచ్చిన గ్రామాదులు.

గ్రామాదుల్కు తవిశీలు—

౧ పాదటూరు
౧ కొండ్డముడి.
౧ వుంన్నవ