పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39

జూపూడి

కైఫియ్యతు మౌజే జూపూడి సంతు పొంన్నూరు తాలూకె చిల్కలూరి పాడు

సర్కారు ముతు౯ జాంన్నగరు యీలాకే రాజామానూరు వెంక్కట కృష్ణారావు.

యీ గ్రామాన్కు పూర్వం నుంచ్చిన్ని జూపూడి అనే వాడ్కి వున్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు యీ రాజ్యం చేసేటప్పుడు వీరి దగ్గిర మహా ప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు శాలీవాహనం ౧౦౬२ శక (1145 AD) మంద్దు బ్రాంహ్మణుల్కు గ్రామ కరణీకములు వ్రాయించ్ని యిచ్చే యడల యీ గ్రామాన్కు వెలనాడు భారద్వాజ గోతృడయ్ని కాపల్లె సూరపరాజుకు యేక భోగంగ్గా మిరాశి నిన్న ౯౦చ్చినారు గన్కు తదారభ్యా యేతద్వంశీకులయ్ని వారు అనుభవింస్తూ వుంన్నారు. వడ్డెరెడ్డి కన్నా౯ట్క, ప్రభుత్వములు శాలీవాహనం ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జర్గిన తర్వాతను మొగలాయి ప్రభుత్వం వచ్చె గన్కు ఆ అధికారులు దేశముఖు దేశపాండ్యా మొదలయిన బారాముత సద్ధి హోదాలు నిన్న ౯యించ్చి కొండ్డవీటి శీమ సముతు బంద్దీలు చేశే టప్పుడు యీ గ్రామం పొంన్నూరు సంతులో దాఖలు చేశి సంతు ఆమీలు చౌదరి దేశ పాండ్యాల పరంగ్గా స్న ౧౧౨౧ ఫసలీ (1711 AD) వర్కు అమాని మామ్లియ్యతు జర్గించ్చినారు. స్న ౧౧౨౨ (1712 AD) ఫసలీలో యీ కొండ్డవీటి శీమ జమీదాల్ల౯కు పంచ్చి పెట్టె యడల యీ గ్రామం చిల్కలూరి పాడు తాలూకాలో మానూరి వెంక్కన్న పంత్తులు గారి వంటులో వచ్నిది. గన్కు వెంక్కంన్న పంత్తులు గారు అప్పాజీ పంత్తులు వెంక్కట్రాయినింగారు వెంక్కట కృష్ణునింగారు నర్సన్నగారు స్న ౧౨౧౯ (1809 AD) ఫసలీ వర్కు ప్రభుత్వం చెశ్ని తర్వాతను వెంక్కట కృష్ణునింగారు సదరహి శకము లగాయతు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

రిమాకు౯ గ్రామగుడి కట్టు కుచ్చళ్లు ౪౦కి మ్ని హాలు

౧ గ్రామ కంఠం
౦ ౹ ౦ మాలపాడు
౦ ౺ ౦ బత్తూల పాపయ వసం తోటకు
౧ ౹ ౦ చర్వు కుంట్టలు ౫కి
౦ ౺ ౦ గ్రామ చర్వునకు ౧కి
౦ ౹ ౦ మామిడి కుంట్టవ ౧కి
౦ ౦ ౨ మాల కుంట్ట వ ౧కి