పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

గరికెపాడు

కయిఫియ్యతు మౌజే గరికెపాడు సంతు పొంన్నూరు తాలూకె చిల్కలూరు

సర్కారు మృతు౯ జాంన్నగరు రాజా మానూరి వెంకట కృష్ణా రావు మజుంద్దారు.

ఈ గ్రామాన్కు పూర్వం నుంచ్చిన్ని గరికెపాడు అనే వాడికె వుంన్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహరాజులుంగ్గారు ప్రభుత్వం చేశెటప్పుడు వీరి దగ్గిర మహా ప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు శాలీవాహనం ౧౦౬२ శకం (1145 AD) మంద్ను సమస్తమయ్ని నియ్యోగులకు గ్రామ కరిణీకపు మిరాశీలు నిన౯యించే యడల యీ గ్రామాన్కు వెలనాడు పరాశర గోత్రులయ్ని అమ్మిరాజు గంగరాజుకు ఎక భోగంగా మిరాశి నిన౯యించి యిచ్చినారు. గన్కు తదారభ్యయే తద్వంశీకులయ్ని వారు గరికపాటి వారు అనే అభిదానం చాతను అనుభవిస్తున్నారు.

సవరహి గంగరాజు కరిణీకం అనుభవిస్తూ వుండి గ్రామంలో శివాలయం కట్టించి లింగ ప్రతిష్ఠ చేశినారు.

వడ్డె రెడ్డి కనా౯టక ప్రభుత్వములు శాలివాహనం ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జరిగిన తర్వాత మొగలాయి ప్రభుత్వం వచ్చె గన్కు కొండ్డవీటి శీమ సముతు బంద్దీలు చేశేటప్పుడు యీ గ్రామం పొంన్నూరు సముంతులో దాఖల్ చేశి సముతు అమీలు చౌదరు దేశపాండ్యాల పరంగ్గా బహు దినములు అమాని మామిలియ్యతు జరిగించినారు. కొండ్డవీటి జమిదాల౯కు పంచి పెట్టె యడల యీ గ్రామం సర్కారు మజుందారులయ్ని రాజా మానూరి వెంక్కంన్న పంత్తులు గారి వంట్టులో వచ్చి చిల్కలూరి పాటి తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు వెంక్కన్న పంత్తులు వెంకట్రాయనింగారు స్న ౧౧౬౫ ఫసలీ (1775 AD) వర్కు అధికారం చేశ్ని తర్వాతను స్న ౧౧౬౬ ఫసలీ (1756 AD) లగాయతు వెంక ట్రాయనింగారు ప్రభుత్వం చేస్తూ వుండ్డగా వీరి రాజ బంధువులయ్ని పులుగుండం హయిగ్రీవ పంతులు యీ గ్రామానకు దక్షిణ పాశ్వ౯ మంద్దు, గ్రామ మధ్యమందు విష్ణు స్తలం కట్టించ్చి శ్రీ వేణు గోపాల స్వామి వారిని ప్రతిష్ఠ చేశి యీ స్వామి వార్ని పూజించడాన్కు కాకమాను బుచ్చయ్య అనే విఘనసుణ్ని నిన౯యించినారు గన్కు నిత్య నైవేద్య దీపారాధనలు జరుగగలంద్లుకు కు ౧ కుచ్చల భూమి యినాము యిప్పించి వెంకట కృష్ణమ్మ గారు వీరి తనూజులయిన నరసన్న రావు గారు స్న ౧౨౧౮ ఫసలీ (1808 AD) వర్కు ప్రభుత్వం చేశ్ని తరువాతను వీరి తమ్ములయ్ని వెంక్కంన్న పంతులు గారి కౌమారులయ్ని వెంక్కట కృష్ణునింగారు స్న ౧౨౧౯ ఫసలీ (1809 AD)లో ప్రభుత్వం వహించి అధికారము చేస్తూ వున్నారు.

రిమాకు౯ గ్రామం గుడి కట్టు కుచ్చళ్ళు ౨౦౦