పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

91

మామిళ్ళపల్లి

కై ఫియ్యత్తు మౌజే మామిళ్ళపల్లి సంత్తు పొంన్నూరు సర్కారు మత్తు౯ జాంన్నగరు

తాలూకె సత్తినపల్లి

యీ గ్రామాన్క పూర్వం నుంచ్చి మామిళ్ళపల్లి అనే పేరు వుంన్నది.

యీ స్థలమంద్దు పూర్వం ఆగస్త్యులు శివలింగ్గ ప్రతిష్ఠ చేసినారు గన్కు అగస్తేశ్వర స్వామి వారని ఆ లింగ్డమూత్తి౯కి పేరు వచ్చినది.

తర్వాతను గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి దేవ మహరాజులుంగ్గారు శా ౧౦౫౬ (1134 AD) శకం మొదలుకుని ఈ దేశములు సాధించ్చి ప్రభుత్వం చేశే యెడల వీరి దగ్గర మహ ప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు శా ౧౦౬२ (1145 AD ) అగునేటి రక్తాక్షి నామ సంవ్వత్సర భాద్రపద బ 30 అంగార్క వారం తమ ప్రభువులయ్ని గణపతి గారి దగ్గిర ధారా గ్రహితం బట్టి సమస్తమయ్ని బ్రాంహ్మణుల్కు గ్రామ మిరాశీ సనదులు వ్రాయించ్చి, యిచ్చే యెడల యీ మామిళ్ళపల్లికి యజుశాఖాధ్యయనులుంన్ను కౌండిన్యసగో త్రోద్భవు లుంన్ను అయ్ని మామిళ్ళపల్లి పెరుమాళ్ళప్పకు ఆరువేల నియ్యోగికి యేక భాగంగ్గా మిరాశీ నిన౯యించ్చినారు. వడ్డెరెడ్డి కనా౯ట్క ప్రభుత్వములు జర్గిన తర్వాతను తురకాణ్యం ప్రజలమయ్ని తర్వాతను పాదుశాహిలు కొండ్డవీటి శీమ సర్కారుకు నముతుబంద్దీలు మొదలయ్ని వ్యవహారపు ఖాయిదాలు యేర్పరచి బారాముతసద్ది హోదాలు నిన౯యించ్చే యెడల ఈ గ్రామం పొంస్నూరు సముతులో చేర్చి పాత్మని వార్ని దేశపాండ్యాలుగా నుంన్ను మాసూరి వారిని మజుముదార్లుగా నుంన్ను మాణిక్యారావు వార్ని దేశముఖులు గా నుంన్ను యేప౯రచి చాలదినములు అమాని మామ్లియతు జర్గించ్చినారు స్న ౧౧౨౨ (1712AD) ఫసలీలో కొండ్డవీటి శిమ 3 వంట్లు చేసి జమీదార్లకు పంచ్చిపెట్టే యెడల ౠ గ్రామం మానూరి వెంక్కంన్న మజ్ముదారు గారి పంట్టులో చేరినది గన్కు రాజా వెంక్కంన్న రావు గారు యీ గ్రామం త్మ బావమరుదులయ్ని వెలిగుండ్డం మురహరి పంత్తులు గార్కి మనవత్తి౯ కింద ఇచ్చిరి.గన్కు ఆయ్న యీ స్తలమందు వుంన్న కోటలో ప్రవేశించ్చి మనువత్తి౯ అనుభవిస్తూ వుండగా వెంక్కంన్న గారు అప్పాజీ పంతులు గారు వెంక్కటాయునింగ్గారు వ్యవహారములు చేస్తూ మురహరి పంత్తులు గార్కి మజ్కురు మనువర్తి జరిగించినారు.

తదనంత్తరం పయ్ని వ్రాశ్ని వెంక్కంన్న గారి తంమ్ములయ్ని జోగంన్న గారి కుమారులయ్చి వెంక్కట కృష్ణునింగ్గారు ప్రభుత్వానకు వచ్చి వెలుగుండం మురహరి పంత్తుల కుమారులయ్ని హయగ్రీవ వంతులకు యీ గ్రామం పూర్వ ప్రకారమే వసతి క్రింద్ద అనుభ