పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

గ్రామ కైఫియత్తులు


కోమారులయ్ని వెంక్కటరమణయ్యారావుగారు ఆ సంవత్సరమందే ప్రభుత్వాన్కి వచ్చి ఆ గ్రామంలో వుండ్డకున్నా దేవాలయములు ఖిలపడి వున్నవి గన్కు గ్రామస్తులు పింగ్గళనామ సంవ్వత్సరమందు వేణుగోపాలస్వామి వారి ఆలయం జీనో౯ద్దారం చేయించ్చి సంప్రోక్షణ చేయించ్చినంద్ను యీ స్వామి వార్కి నిత్యనైవేద్య దీపారాధనలకు కు..మాన్యం యిప్పించ్చి మరింన్ని క్రొధన సంవత్సర ఫాల్గుణ శుద్ధ ౧౫ మిలు గ్రామస్తులు పూర్వోత్తమయ్ని బ్రాంహ్మేశ్వరస్వామి వారి ఆలయం జీనో౯ద్ధారం చేశి సంప్రోక్షణ చేసినంద్ను యీ దేమునికి నిత్య నైవేద్య దీనారాధనలకు కుం (కుంటల) మాన్యం యిప్పించ్చి స్న ౧౨౨౧ ఫసలీ (1811 AD) వరకు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

శ్రీ స్వామి వారి ఆర్చకులు.
శ్రీ వేణుగోపాలస్వామి వార్కి శ్రీనివాసులు రంగ్గాచాలు౯ విఘనసుడు.
వీరి పూర్వీకులు గ్రామస్తులు నిర్ణయించ్చినారు.
యినాములు,
౧ శ్రీ స్వామి వాల౯కు
కు ౦ ౹ ౦ వేణుగోపాలస్వామి వార్కి
కు ౦ ౹ ౦ బ్రహ్మేశ్వరస్వామి వారికి-గ్రామ చౌధరి అయిన దాసరి పాపన్న త్రవ్వించిన చెరువులు ౨కి యినాము.
బ్రహ్మేశ్వరస్వామి వారికి
వల్లూరి శరభన అనే తపోధనుడు ఆధరాపురం వాసుదేవాచార్యులు వార్కి పూర్వం వెంక్కటా కృష్ణునింగారు యిచ్చినది.
౧ ౹ ౦ ...బూడ భూపానాచార్యులు గారికి
౧ ౹ ౦ వుప ద్రష్ట పాపన్నా శాస్త్రుల వారికి
౧ తూము ను బస్ధగా. . . . .
౦ ౺ ౦ మండన రామచంద్రుడు.....
౧ ౺ ౦ మత్కపల్లి నరసింహం అనే కవికి
౧ ౹ ౦ గ్రామ పురోహితు చంగ్గిపేరు బొట్లు.
————————
౬ ౻ ౦