పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

95

వేజళ్ల

కయిషియ్యతు మౌజే వేజళ్ల సముతు గుంటూరు సర్కారు

మృతుజాంన్నగరు తాలూకే రేపల్లె——

యీగ్రామానకు పూర్వం నుంచ్చింన్ని వెజళ్ల అనే పేరు వుంన్నది. గజపతి శింహ్వాసనస్థుడయ్ని గణపతి మహారాజులుంగారు ప్రభుత్వం చెసెటప్పుడు విరి ప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శాలివాహనం ౧౦౬౭ (1145 A.D) శక మంద్దు బ్రాంహ్మణులకు గ్రామ మిరాశీలు నిన౯యించ్చె యడల యీ గ్రామాన్కు శుక్లయజుశ్యాఖాధ్యయులయ్ని వెజళ్లవారికి గ్రామ మిరాశి నిన౯యించ్చినారు గన్కు తదాభ్యా తద్వంశీకులయ్ని వారు అనుభవిస్తూ వుంన్నారు.

రెడ్లు ప్రభుత్వానకు వచ్చి శాలివాహనం ౧౨౪౦ శకం (1318 A.D) లగాయతు రాజ్యం చెశెటప్పుడు మజ్కూరి మిరాశీ దారుడయ్ని ... గ్రామాన్కు తూపు౯ భాగమంద్దు శివ స్తలం కట్టించ్చి శ్రీమల్లేశ్వరస్వామివారనె లింగమూత్త౯ ప్రతిష్ఠచెశి మరింన్ని గ్రామ మధ్యమంద్దు విష్ణుస్తలం కట్టించి శ్రీగోపాలస్వామివారనే విష్ణుమూత్తి౯ ప్రతిష్టచెశినాడు గన్కు యీస్వామివారులకు నిత్యనై వైద్య దీపారాధనలు జరుగగలంద్లుకు చెశ్ని యినాము —

శ్రీస్వామి వాలకు శ్రీమల్లేశ్వరస్వామివారికి శ్రీగోపాలస్వామి వారి కి నవరాత్రములు, దీపావళి మాన్యం, సంక్రాంతి శివరాత్రి శ్రీరామ నవమి యిత్యాది సంవత్సరోత్సవంబ్బులకు సంవ్వత్సరం వ ౧ కి కి శ్రీ మల్లేశ్వరస్వామివారికి — శ్రీ గోపాలస్వామివారికి—

యీప్రకారంగ్గా నిన౯యంచెశినారు——

వడ్డె రెడ్డి కనా౯టక ప్రభుత్వములు శాలివాహనం ౧౫౦౦ శకం (1578 AD), వర్కు జరిగిన తర్వాతను మొగలాయీ ప్రభుత్వం వచ్చెగన్కు సర్కారు సముతు బంద్దీలు యెప౯రచి బారాముతస్సద్ధి హోదాలు నిన౯యించ్చె యడల యీ గ్రామం గుంట్టూరు సముతులో దాఖలుచెశి సముతు ఆమీలు, చౌదరు, దేశపాండ్యాల పరంగ్గా బహుదినములు అమాని మామలియ్యతు జరిగించ్చినారు. స్న ౧౧౨౨ ఫసలీ (1712 A.D) లో కొండవిటి శీమ జమీదాల౯కు మూడువంట్లుచెశి పంచ్చి పెట్టె యడల యీ గ్రామం రమణయ్య మాణిక్యారాయునిం గారి వంత్తువచ్చి రెపల్లి తాలూకాలో దాఖలు అయ్నిది. రషుణయ్య మాణిక్యారాయునింగారు,