పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముట్నూరు

55


యీశాన్యానికి కోవెలమూడి చెబ్రోలు కూడలి మంమ్ముల కుంట్ట నడియ చింహ్న ఆకుంట్ట వడియనడుముగా దక్షిణముఖమై నడువగా రామకోటి సకటి తూవు౯ దరిని చెబ్రోలు,కోడూరి కూడలి ముమ్ముల వుంన్న పెద్దపుట్ట తూపు౯ధరిని రెండ్డు రాతి స్తంభాల చిహ్న. ఆ రాతిస్తంభాల వద్దనుంచ్చి కొట్టి తూపు౯ దక్షణ ముఖమై నడువగా సూర్య చంద్రాంక్కితమైన . . ఖ ం॥ం దాటి దక్షిణం నడువగా కోడూరి తెరువుదాటి యర్రరాయి స్తంభముమీదుగా కుంచాల మెరద తూపు౯ బాలు పుట్టలమీదుగా కోడూరి జూపూడి కూడలి ముమ్ములవున్న నెలపడియ యర్రరాతి స్తంభంచిహ్న తూపున్ దరిని లెమల్లె చెబ్రోలు కూడలి మమ్ముల రెగులకుంట్ట చింహ్న ఆ కుంట్ట తూవున్ కట్టకుని... కుని తూపు౯ ముఖమై... నడుపగా చాటతెలన్ కుంట్ట అంద్దునుండి పడమర ముఖమై నడువగా వువ్వి(?) పోచ, యర్రరాతిస్తంభం చిహ్న, అక్కడ నుంచ్చి నయిరుతి ప్రదీచి ముఖమై నడువగా జావూరి తెరుపుదాటి పోంగ్గా చవిటి దక్షిణపుదరిని యర్రరాతి స్తంభం దాటి నేలపడియ పువ్వి పొదచిహ్న అక్కడ మేడితాప, యీ మెడితాపఘట్టు పట్టుకొని దక్షిణ ముఖమై నడువగా పూడి కాలి౯ మల౯ కూడలి మమ్మూలకుంట్ట పడియ దక్షిణపు కుంట్ట చిహ్న ఆ దక్షిణపు కుంట్ట కట్టనుండ్డి నడువగా రెండు అడ్డవాగులుదాటి కాలి౯ మల్౯, పల్లూరి తెరువులు దాటి కాటి దక్షిణంగా కాలి౯చల౯(?). కారెంపూడిపాడు కూడలి ముమ్ములకుంట్ట మడియ శంఖుపక్రాంకితమైన యర్రరాతి స్తంభ చిహ్న.

అంద్దునుండి వుత్తరముఖమై నడువగా కారెంపూడి తెరువు పట్టిపోగా కన్యధార కుంట్టు పడమటి గట్టు మీదుగా వుత్తరమై నడువగా కుంట్ట పడియ(?) పులిచింత్తలు చింహ్న అక్కడ మెడితాప ఆమెడితాపట్టు పట్టుకొని పడమట నడుపగా కుంట్ట పడియ చిహ్న అక్కడనుండి వుత్తర ముఖమై నడువగా పడియ చిహ్న. అక్కడ పెడితాప ఆమెడితాప పడమర ముఖమైన నడుపగా కారెంపూడిపట్టు చెర్కూర్ కూడలి ముమ్ములపెద్దకుంట్ట పడమటి కట్ట చిహ్న. అక్కడ నుండ్డి వుత్తరముఖమైనడువగా చెర్కూరు తెరువులో కుంట్ట పడమడి మీదుగా వుత్తరమైనడువగా వరగోగు కుంట్ట వుత్తరపు పడమటి మూలను యెఱ్ఱరాతి స్తంభం మీదుగా ఉత్తరమే పోగా చిల్కముక్కు సల్లరాతి స్తంభం డమురుగత్రిశూలము సూర్య చంద్రాంకితమైన వట్టె చెర్కూరు లెమల్లెపాడు కూడలి ముమ్ములచిహ్న అంద్దునుండి తూపు౯ ముఖమై నడువగా యర్రరాతి స్తంభం మీదుగా యీశాన్య ప్రాచీనమై నడువగా వెమల్లెతెరువుకుంట్ట వుత్తరపు కట్టమీదుగా తూపె౯ నడువగా చెబ్రోలు కోవెలమూడి కూడలి ముమ్ములగారలకుంట్ట దక్షిణపు కట్టమీదుగా తూపు దరినివున్న యర్రరాతి స్తంభంచింహ్న అంద్దునుండి ఆజ్ఞేయ ప్రాచీనడువుగా గణపతి కుంట్ట తూర్పు కట్ట నడుమనువున్న గణపతి మీదుగా ఆజ్ఞేయ ముఖమై నడువగా కుంట్ట వడియ రాతిస్తంభం అక్కడనుంచి తూపు౯ నడువగా కోవెలమూడి తెరువు దాటి చుట్టూ కట్టకు పుత్తరపుకట్ట చిహ్న అక్కడ నుంచ్చి తూర్పు నడువగా చేబ్రోలు కోవెలమూడి కూడలి ముమ్ములకుంటలు. తేషాం మధ్యవర్తి క్షేత్రం

శ్లోకము॥ స్వదత్తా ద్విగుణంపుణ్యం పరదత్తాను
పాలనం పరదత్తాపుహరెణ
స్వదత్తం నిష్పలం భవేత్
స్వదత్తాం పరదత్తాం వ్యాదయోహరేశి