పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41


పొత్తూరు

కైఫియ్యతు మౌజె పొత్తూరు సంతు గుంట్టూరు సర్కారు

మృతు౯జాంన్నగరు తాలూకె రాచూరు.

యీ గ్రామాన్కు పూర్వంన్నుంచిన్ని పొత్తూరి అనే వాడికి వుంన్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజు ప్రభుత్వం చెశెటప్పుడు వీరిదగ్గర మహాప్రధాను లయ్ని గొపరాజు రామంన్నగారు బ్రాహ్మణులకు గ్రామమిరాశిలు నిన౯యించ్చే యడల యీ గ్రామాన్కు కౌండ్డిన్యస గోత్రులయ్ని పొత్తూరి వారికి ఏకభోగంగ్గా కరిణీకపు మిరాశి యిచ్చినారు గన్కు తదారభ్య యీవర్కు అనుభవిస్తూ వుంన్నారు.

రెడ్లు ప్రభుత్వం చెశెటప్పుడు గ్రామస్థులు గ్రామానకు పుత్తర పాశ్వ౯ం శివ స్తలం కట్టించ్చి సొమెశ్వరుడనె లింగమూర్తి౯ని ప్రతిష్టచెశి యీ ఆలయాన్కు తూపు౯ భాగమంద్దు విష్ణు స్తలం కట్టించ్చి శ్రీ వేణుగోపాలస్వామివారిని ప్రతిష్ఠ చెశినారూ.

శా. ౧౫౦౦ శకం ( 1578 A. D.) వర్కు వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వములు జరిగిన తర్వాతను మొగలాయి ప్రభుత్వం వచ్చెగన్కు అప్పట్లో జర్గే దారుణముల చాతను దేవస్తానములు అంత్తరువుపడ్డది.

కొండ్డవీటిశీమ సంతు బఁద్దిలు చేశెటప్పుడు యీ గ్రామం గుంటూరు సంతులొ దాఖలు అయ్నిది గన్కు బహుదినములు సంతు అమిలు పరంగ్గా అమాని మామిలియ్యతు జరిగెనూ

స్న ౦౧౨౨ ఫసలీ (1712 A.D)లో కొండ్డవీటిశీమ జమీదాల౯కు వంట్లు చేశి పంచ్చిపెట్టే యడల యీగ్రామం ముత్తు౯జాంన్నగరు సర్కారు దేశముఖి మంన్నె వారయిన రమణయ్య మాణిక్యరాయునిఁ గారి వంట్టులొ వచ్చి రేపల్లె తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు రమణయ్యగారు మల్లంన్నగారు శీతంన్నగారు గోపంన్నగారు స్న ౧౧౬౮ ఫసలి (1758 A.D) వర్కు ప్రభుత్వం చెశ్ని తర్వాతను స్న ౧౧౬౯ ఫసలి (1758 A.D)లో పయిని వ్రాశ్ని శితంన్నా మాణిక్యరాయునిం గారి కొమారుడయ్ని జంగ్గంన్నా మాణిక్య రాయునిఁగారు ప్రభుత్వానకు వచ్చి స్న ౧౧౮౨ ఫసలీ (1772 A.D) వర్కు అధికారం చేశ్నిమీదట విరి తంమ్ములయిన తిరుపతి రాయునింగారు కల్త పెట్టినంద్ను తాలూకా సఖం పంచ్చుకునె యడల యీగ్రామం తిరుపతి రాయునిగారు వంత్తువచ్చి రాచూరు తాలూకాలో దాఖలు అయ్నిది. తిరుపతి రాయునింగారు వీరి కొమారులయ్ని అప్పారాయునింగారు శీతంన్న గారు స్న ౧౨౦౮ ఫసలీ (1798 A.D) వర్కు ప్రభుత్వంచేశి నిస్సంత్తుగా పోయిరి గన్ను పయిని వ్రాశ్ని జంగ్గంన్నా మాణిక్యారాయనింగారి కొమారులయ్ని భావంన్నా మాణిక్యరాయునిం గారు మూడు సంవ్వత్సరములు ప్రభుత్వం చెల్ని మిదట రాచూరి తాలూకా యాలం వెశి నంద్ను రాజామల్రాజు వెంక్కట గుండ్డారాయునింగారు కొనుక్కుని స్న ౧౨౧౨ ఫసలీ (1802 A D) లగాయతు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.