పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చముళ్లమూడి

87


స్న ౧౨౨౨ ఫసలీ (1812 A. D)లో కొండ్డవీటి శీమ మూడువంట్లుచేశి జమీదాల౯కు పంచ్చి పెట్టే యెడల యీ గ్రామం సర్కారు మఙ్ముదారులయ్ని మానూరీ వెంక్కంన్న పంత్తులుగారి వంట్టులోచేరి చిల్కలూరిపాడు తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు వెంక్కంన్న పంత్తులుగారు పయిని వాన్ని సూరుసోమయాజులు గారికి సాలు ౧ కి హు ౧౨ం వరహాల చొప్పున శ్రోత్రియం యేప౯రచి వెంక్కంన్న పంత్తులు అప్పాజీ పంత్తులు వెంకట్రాయునింగ్గారు వెంక్కట కృష్ణునింగ్గారు యిచ్చిరి గన్కు సదరహి సూరుసోమయాజులు వీరిపుత్రులై న తిరుమల సోమయాజులుంగారు అనుభవించ్చినారు ——

తదనంతరం తిరుమల సోమయాజులుంగారి పుత్రులైన చంద్రశేఖర సోమయాజులు సూర్యనారాయణ సోమయాజులు సూరిసోమయాజులు కృష్ణ సోమయాజులుగారు వీరికి వెంక్కట కృష్ణునింగారు మామూలు ప్రకారం జరిగించ్చిరి. తదనంత్తరం వీరి కుమారులయ్ని నర్సంన్న గారు ప్రభుత్వంచేస్తూ వుంటే పయ్ని వాన్ని ఆప్పాజీ పంతులుగారి కొమారులయ్ని వెంక్కటేశంగారు తాలూకా సఖంపంచ్చుకున్నారు గన్కు యీ గ్రామం వేంక్కటేశం రావుగారి వంత్తు వచ్చిన సత్తెనపల్లి తాలుకాలో దాఖలు ఆయినది గన్కు వేంక్కటేశంగారి ప్రభుత్వంలోను జరిగించ్చినవారైనారు గన్కు తదనంత్తరం వీరి కొమారులయ్ని వెంక్కటరమణయ్యగారు ప్రభుత్వాన్కు వచ్చి యీ అగ్రహారాన్కి సాలు ౧కి హో300 వరహల చొప్పున శ్రొత్రియం వుంచ్చి కొంన్ని సంవత్సరములు జరిగించ్చి తదనంత్తరం అగ్రహరీకులయ్ని కృష్ణసోమయాజులుగారికి పూర్వంనుంచ్చి జరుగుతూవుండే యీనాం కు ౮ కుచ్చళ్లు పొలముంన్నూ తతిమ్మా భటవృత్తి౯ మాన్యములు జారీగావుంచ్చి గ్రామం ఆగ్రహారీకుల పరంచేశిరి. స్న ౧౨౨౨ ఫసలీ (1812 A.D) వర్కు ప్రభుత్వం చేస్తూవుంన్నారు గన్కు కృష్ణసోమయాజులు సదరహి యినాము అనుభవిస్తూ గ్రామం మణాయింపు చేసుకొంట్టూవుంన్నారు.

రిమాకు౯ గ్రామగుడికట్టు కుచ్చళ్లు-౫౦౹౦ కిమ్నీ హాలు

౯ గ్రామకంఠం
౬౺౦ గ్రామాన్కి తూర్పున అగ్రహరీకులు వేయించ్చిన వనంత్తట చింత్తది -
౪౺౦ మరింన్ని గ్రామాన్కు దక్షిణం వేయించ్ని తోపు-
౨౦౦ గ్రామాన్కు తూపు౯ భాగం అగ్రహరీకులు తవ్వించిన చెర్వు ౧ కి
౦౻౦ కుంటలు ౩౪
౦౺౦ లక్ష్మీమానూరి సోమయాజులుగారికుంట్ట
౦౦ఽ చేబ్రోలు నారాయణకుంట ౧ కి
౦౺ఽ మింగాలు కుంట
౦౻౦ బుల్ల వాగులు
౧౹ డొంక్కలు ౪ కి
————————
౨౨౻౬
౭౬౬ యినాములు