పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

గ్రామ కైఫీయత్తులు


ములో గ్రామమధ్యమంద్దు శివాలయం కట్టించ్చి శ్రీ మల్లిఖాజు౯న స్వామివారిని ప్రతిష్ట చేసి చేబ్రోలు యోగానంద్దం వీరయ్య అనే పూజారిని అచ౯కత్వానకు నియమించ్చినారు గన్కు యీదేవునికి నిత్యనైవేద్య దీపారాధానలకు జర్గగలందుకు,౧ కుచ్చల పొలం యినాము యిప్పించి యిదివర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. కాళయుక్తి నామ సంవత్సరములో మజ్కురి కాపు అయ్ని మక్కె కొండప్ప అనే అతను గ్రామ మధ్య మంద్దు విష్ణు స్తలం కట్టించ్చి వేణుగోపాల స్వామివారిని ప్రతిష్ఠ చేశి పుసులూరి శేషయ్య అనే విఘనసుంణ్ని ఆచ౯న చేశేటంద్కు నియమించ్చినారు గన్కు నిత్యనై వేద్య దీపారాధనలకు కుం ౧ పొలం మాన్యం యిప్పించినారు. యిది వరకు ప్రభుత్వం చేస్తూ వున్నారు. తిరుపతి రాయునింగారి వంతు వచ్చిన గుండ్డవరం వారి ప్రభుత్వంలో శోభకృత సంవత్సరములో మజ్కూరి మిరాశీ దారుడయ్ని గుండవరపు అచ్చంన్న గ్రామ మధ్యమంద్దు విష్ణు ఆలయం కట్టించ్చి వేణుగోపాల స్వామివారిని ప్రతిష్ట చేశి అచ౯న చేశేటంద్కు కారెంచేటి అప్పయ్య అనే ఆచ౯కుంణ్ని నియమించ్చి నారు గన్కు యీస్వామివారికి నిత్యనైవేద్య దీపారాధనలకు జరగగలంద్లుకు కుచ్చల పాతిక పొలం మాన్యం యిప్పించ్చి తిరుపతి రాయునింగారు వీరి కొమాళ్లు అయ్ని ఆప్పారాయునింగారు శీతంన్నగారు స్న ౧౨౦౮ ఫసలీ (1798 A.D) వర్కు ప్రభుత్వం చేశి సంత్తు లేకుండా పోయిరి గన్కు జంగ్గంన్నగారి కొమారుడయ్ని భావంన్నగారు స్న ౧౨౧౧ ఫసలీ (1801 A.D.) వర్కు అధికారం చేశ్ని తర్వాత మహారాజశ్రీ కుంపిణీవారు తాలూకా యాలం వేయించ్చిరి గన్కు రాజా మల్రాజు వెంక్కట. గుండ్డా రాయునింగారు కొనుక్కుని సదరహి ఫసలీ లగాయతు స్న ౧౨౨౨ ఫసలీ (1812 A.D.) వర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

రిమాకు౯గ్రామం గుడికట్టు కుచ్చళ్లు——౩౫
కిమ్నిహాలు——
౦ ౺ ౦ గ్రామకంఠం
౧ ౺ ౦ చెరువుల ౨ కి——
పాపరాజు వేయించ్చిన తోటలు —
౦ ౹ ౦ మక్కె కొండ్డయ వేయించ్నిది ——
౦ ౺ ౦ వనంత్తొటలు ౨ కి——
౦ 6 ౦ డొంక్కలు——
——————
౨ ౹ ౽
గ్కాతతింమ్మా ———— ౩౨౦౺౽
......అక్కెవర్పు వెంకటేశం———
.......
౦ ౻ ౦ సీమంచి వీరేశం నుంచిన.........
రిమార్కు గుండ్లవరం గ్రామం గుడికట్టు కుచ్చళ్లు— ౩ ౨
కిమ్ని హాలు——