పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

గ్రామ కైఫియత్తులు

అటువెన్కను చోళమహారాజు నూటయిరువై నాలుగు సంవ్వత్సరంబ్బులు యేలెను. ఆటువెన్కను యవనభోజుండు నూటయిరువై సంవత్సరంబ్బులు యేలెను. యీప్రతాపరుద్రుడు యెనభై యెనిమిది యేండ్లు యేలెను. యీప్రతాపరుద్రుడు కలియుగం ౩౬౦౦ సంవ్వత్సరంబులు యేలెను. మీదట దుంద్దుభినామ సంవ్వత్సరమందునను పట్టుబడెను. పరరాజు చాతను యీ ప్రతాపరుద్రుడి యేలుబడి వృత్తాంతము. యీప్రతాపరుద్రుడు త్రినేత్రుడుగన్కు ముక్కంట్టి అనిరి. రుద్రాంశముగన్కు ప్రతాపరుద్రుడు అని నామముగనుక ప్రతాపరుద్రుడనిరి. మూడు కన్నులు గన్కును ముక్కంట్టి అనిరి. యీప్రతాపరుద్రుడు ధరణికోట బెట్టించి యీధరణికోట లోను కాపురం వుండ్డి యీనాటి కొండ్డవీటి శీమలు ౧౪ యీ కొండ్డవీటి శీమకింద్ద చెల్లెశీమలు అద్దంకిశీమ గ్రామాదులు ౫౫ అంమ్మనమోలు ౫౫ కంద్దుకూరు శీమ ౬౫ నెల్లూరు శీమ ౧౫౦ వుదయగిరిశీమ ౮ం భుండ్డిశీమ ౪౪ పొదిలెశీమ ౬౬ మారెడ్లశీమ ౫౮ కోటశీమ ౬ం దూపాటిశీమ ౩౬౦ నాగాజు౯నకొండ శీమపు గ్రామాదులు ౧౫౦ కి మోచల౯ అరువయి నాలుగు క్కారెంపూడి ౧౫ గురజాల ౧౬ దముడుగోడు ౧౨ త్తంగ్గెడ ౪౪ యీ అయిదున్ను నాగాజు౯ని కొండశీమ వలినాడు అందురు. వినుకొండ్డ శీమ ౨౨౫ బెల్లంకొండ్డశీమ ౧౦౦ కొండవీటిహవేలీ ౫౮౦ యీపద్నాలుగు సంతులు యిప్రతాపరుద్రుడు యేలెను అన్నిన్ని ధరణికోట బైట నుంచ్చి కాపురం వుండ్డి యేలెను. అటుతరువాతను వోరుగల్లు దుర్గం కట్టించ్చి ఓరుగంటిలో నువుండి తదనంత్తరమందునను పాలకురికి సోమనారాధ్యులు వోరుగంట్టికి ప్రతాప దశ౯నానకు వచ్చె గన్కును ఆసోమనారాధ్యులమహత్తు చూడవలెనని గవిని దగ్గిరను దశ౯నానకు రాకుండ్డా నిల్కడ చేయించ్చె గన్కును ఆసోమనారాధ్యులు అక్కడ తనయందు శివస్వరూపం - వుండచూపె గన్కును ఆ ప్రతాపరుద్రుడు తానేవచ్చి ఆసోమనారాధ్యుల యందు శివస్వరూపంచూచి అపరాధ క్షమ చెయ్యమని వేడి సోమనారాధ్యులను గురుస్తానం చేసుకొనెను. యీప్రతాపరుద్రుడు రుద్ర సంఖ్యగ్రహాలకు అగ్రహారాలు యిచ్చెను.

శ్లొ॥ దదౌధరణి కోటాఖ్యం బ్రహ్మ ప్రీత్యావురం ముడా |
చంద్రాద౯మకుట ప్రీత్యాచంద్ర వోలిపురంద్దదౌ౹౹ -
కేశవర్షణ బుధ్యా వైదదావెక్షు పురంధువి ॥
సోమనారాధ్య గురవే పిడపర్తిపురం దదౌ ౹
యేవంప్రతాపరుద్రాభ్యోకృతవా౯ రుద్ర సంఖ్యయా ౹
ఆదౌ ప్రతాపరుద్రాఖ్య భూపాలో ధర్మపూర్వకం ౹
సప్తర్షిం సంఖ్యయా గ్రామా౯ దదౌసప్తద్విమన్మనాం ॥

యివి పదకొండ్డు గ్రామాలు ప్రతాపరుద్రుడు యిచ్చిన అగ్రహరం. యివి ముక్కంటి దత్తూరు అందురు. ధరణికోట అమరేశ్వరున్కి బ్రంహ్మస్థానంగాను యిచ్చెనూ శివస్థానంగాను చందవోలు లింగోద్భవునకు యిచ్చెను. విష్ణుస్థానంగా పెదచెరుకూరు త్రివిక్రమస్వామి వార్కి యిచ్చెను. గురుస్థానంగ్గాను పాలకురికి సోమనారాధ్యులకు పెదపర్రు యిచ్చెనూ. యీసోమనారాధ్యులు సోమేశ్వర నామాంక్కితంగ్గా లింగ్గాంని చేయించ్చి ప్రతిష్ట చేశి సోమేశ్వరునికి పిండ్తు పిట్టుచేశి నైవేద్యంగ్గాను కట్టడి చేశి పిట్టు సోమేశ్వరుడని నామాంక్కితంచేశి సోమనారాధ్యులు పెదపర్రు సోమేశ్వరున్కి యిచ్చి దేవాలయం కట్టించెను. ససర్షి సంఖ్యగాను యిచ్చిన గ్రామాదులు. విశ్వామిత్రస్థానంగ్గాను కార్యాలయిచ్చెను. భరద్వాజస్థానంగ్గాను సొలస