పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

గుంటూరు

శ్రీ రామ

శు భ మ స్తు

ఆవిష్నుమ స్తు_శ్రీశారదాంబా నీవేకలవు దైవనిర్నయం

జంబ్బూద్వీప విస్తారము

పెదనాగదేవ భట్టు వాశిన ప్రకారము

యీజంబ్బూ వృక్షం మేరువుకు దక్షిణ దిగ్భాగమందున సుదశ౯నమంద్దునను ౨౫౦౦ యోజనంబ్బుల వున్నతంగలదు. దాని పండ్లు భూమిమీదను పడి రాలి సారయు శలయేరులు మేరువుకు వుత్తర దిగ్భాగం తిరిగివచ్చును. ఆనీరుపారునంత్త పర్యంత్తం కనకమయి వుండ్డును. యీవృక్షం వేనబరగినది జంబ్బూద్వీపం. యీజంబ్బూ ద్వీపము నవఖండ్డాలు, యీనవఖండ్డాల భూమధ్య ఆమేరువు పారుతు ౧౬౦౦ యోజనాలులోతు యీ మేరువుకు నాలుగు బాదులు బాదు౧కి ౧౬౦౦ వేలయేశి యోజనాలు యీమేరువును చుట్టు సముద్రం ఆంటివున్నది. యెన్మిది పర్వతాలు యివిగాకను అనేకములయ్ని పర్వతాలు వున్నవి. యీపర్వతాలలోను గాచు చుట్టూ లవణ సముద్రము యాకారం బండ్డికంమ్మివలె వుంన్నది. యీమేరువుకు పర్వతాలు వుత్తర దిగ్భాగమంద్దున ప్రథమ పర్వతం హేమకూటం తూర్పు పశ్చిమాలు అంట్టి వుంన్నది. నిడివి యోజనాలు ౮౦౬౦౦ మేరువు హేమకూటం సంద్దు ౮౦౬౫ యోజనాలు యీ హేమకూటానికి వుత్తరదిగ్భాగాన శ్వేత పర్వతము సముద్రాలు తూర్పు పశ్చిమాలు అంట్టి వున్నది. వీధి ౭౦౧౫౦ యోజనాలు. యీ శ్వేతపర్వతాలకు పుత్తర దిగ్భాగానను శృంగ్గపత పర్వతాలు సముద్రాలు అంటివుంన్నవి. నిడుపు ౬౪౩౦౦ యోజనాలు యీశృంగ్గపర్వతం వృత్తసముద్రం సంద్దు ౮౦౭౫ యోజనాలు సంధు. యీమేరువు దక్షిణ దిగ్భాగన ముందు ప్రధమ నీటి పర్వతం యీపర్వతానకు——— దక్షిణ దిగ్భాగానను శ్వేత పర్వతము యీపర్వతానకు ధక్షిణ దిగ్భాగానను హిమవత్పర్వతం యీపర్వతాలు మూడు సముద్రం అంటి వుండ్డును. మేరువు ఉత్తర దిగ్భాగానను పర్వతాలు వలెనె వెడల్పు నిడుపులు హిమవంతం శేతువు సందు రేఖలు సందులు నిడిపులు సమము యెక్కువ తక్కువలు లేవు. యీమేరువుకు పశ్చిమ దిగ్భాగమందునను మూల్యవంతం పూర్వ దిగ్భాగమునను గంధమాధన పర్వతాలు అందు వుండ్డే యిరుసులవలెను హేమకూట నీలపర్వతాలు అంట్టి వున్నవి. ౩౨౧౫౦ యోజనముల నిడుపులు వీటి తూర్పు పశ్చిమ సముద్రంబుల సందులు౮౦౭౫ యోజనాలు వెడల్పుయివె నవఖండాలు, యీఖండాల పేర్లు వుత్తర సముద్రం శృంగవంతం సందు బైరావృతవర్షం అందురు. మేరువు తూర్పుధక్షిణాల పశ్చమలు నాలుగు దిక్కులు పారు యిలావృతవర్షం అందురు. గంధమాధనం తూర్పు సముద్రం సందు భద్రాశ్వకవర్షం అందురు. మేరువు దక్షిణ దిగ్భాగం నీలపర్వతం నిషిత పర్వతం సందు రమణారమాణాకవర్షం అందురు. యీనిషిధ హేమవంతం సంద్దు పారు కింపురుష సర్పం హిమవంత హేతువు సంద్ధు