పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గారపాడు

15


నేయస్వామివారిని ప్రతిష్ట చేశి నిత్యనై వేద్య దీపారాధనుల్కు కు౦౹౦ పాతికె మాన్యం యిపించ్చినారు.

వీరికొమారులయి మల్లేశ్వరదీక్షితులు అనుభవించ్ని తర్వాతను మల్లు దీక్షితుల కొమారులయ్ని వీరావధానులు అనుభవిస్తూ వుండగా పయ్ని వాశ్ని జంగంన్నగారి తమ్ములయ్ని తిరుపతి రాయునింగారు సదరహిఫసలీ లగాయతు తాలూకా సఖం పంచ్చుకుని ప్రభుత్వంచే శేయడల యీగ్రామం తిరుపతి రాయునింగారి వంట్టులోవచ్చ్ని రాచూరు తాలూకాలో చేర్నిది గన్కు౧౧౯౭ ఫసలీ (1787 A.D.) వర్కు జర్గించినారు. స్న౧౧౯౮ఫసలీ (1788 A.D.)లో మహారాజశ్రీ కుంఫిణీవారు గుంట్టూరు సర్కారుకు ప్రభుత్వాన్కు వచ్చి మూడు సంవ్వత్సరములు అమానిమామ్లియ్యతుచేశిరి గన్కు అప్పట్లో జమీదారుమభ్య పెట్టి అగ్రహారం జర్గకుండ్డాచేశినారు.

తిరుపతి రాయునింగారు, వీరికుమారులయ్ని అప్పారాయునింగారు, శీతన్నగారు స్న౧౨౦౮ ఫసలీ (1798 A.D.) వర్కు అధికారంచేశ్ని తర్వాతను జంగ్గన్నగారి కొమారు లయ్ని భావయ్య మాణిక్యారాయునింగారు స్న౧౨౧౧ఫసలీ (1801 A.D.) వర్కు మూడు సంవ్వత్సరములు ప్రభుత్వంచేశ్ని మీదట కుంఫిణీవారు రాచూరు తాలూకు యాలంవేశినంద్ను రాజామల్రాజు వెంక్కట గుండ్డారాయునింగారు కొనుక్కుని యిదివర్కు ప్రభుత్వంచేస్తూ వుంన్నారు.

స్న౧౧౯౮ (1788 A.D.) ఫసలీ లగాయతు పయ్ని వాశ్ని అగ్రహారీకుల్కు శ్రోత్రియం జర్గలేదు గన్ను యాజమానులనే కరిణీకములో వుండ్డి గ్రామక్కుమాయఘ (కమామిసు) మనాయింపు చేసుకుంటూ వుంన్నారు. రిమాకు౯ గ్రామంగుడికట్టు కుచ్చళ్ళు యనభై మూర పగ్గానను౬౪కుంట్టల ప్రాప్తిని అయ్ని కుచ్చళ్ళు-౨౫

కు. ౦ ౹ ౦ గ్రామ కంఠం -

౦ ౹ = వనంతోటలు ౨కి -
౦ 6 ౬ గ్రామాన్కు వుత్తరభాగం అగ్రహారీకుల వనంతోట వ౧కి
౦ 6 ౬ ......కునారి కొంమ్మురి అంద్దెలు వనంతోట౧కి...

కు. ౧ ౹ - చర్వులు, కుంట్టలు౫కి -

౦ ౻ ౦ గ్రామ చర్వు అగ్రహారీకులు చేయించి
౦ ౹ ౦ యింప్పాళ్ళపోతన అనే కాపువేయించ్ని చర్వుకు౧కి -
౦ 6 = కామ్మూరు అందెలు చరువుకు౧కి
౦ 6 = ముప్పాళ్ళ మూత్తి౯ కుంట్ట ప౧కి .
౦ 6 —— అచార్యుడ కుంట్ట వ౧కి -
౦ ౹ ౦ డొంక్కలు౪కి -
౦ ౹ ౦ వాగులు ౨కి .

కు. ౩ ౻ ౦ యినాములు-

౧ ౹ ౦ శ్రీస్వామి వాల౯కు