పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కారెంపూడిపాడు

7


దానపత్రిక శకం ౧౭౦౪ (1782 A.D.) అగునేటి శుభకృతు నామ సంవ్వత్సర శ్రావణ బహుళ ౧౫ రోజ్ను వాయించి యిప్పించ్చినారు. మానూరి వెంక్కటేశంగారి పుత్రులయ్ని రాజామాసూరి రమణయ్యారావుగారు ఆప్రకారంగానే జరిగిస్తూ వుంన్నారు గన్కు యీమూత్తి౯ సోమయాజులుగారుంన్ను రామేశ్వర సోమయాజులు గారి కొమాళ్లు అయ్ని వెంక్కట నరసింహ్వ సోమయాజులుగారుంన్ను మిరాశీల వాజుమాలతో కూడా అనుభవిస్తూ వుంన్నారు. శా౧౭౩౪ (1812 A.D) అగునేటి ఆంగ్గీరస నామ సంవ్వత్సర ఆశ్విజ బహుళ ౧౨ స్థిరవారము అగ్రహారమయ్ని కారెంపూడిపాడు గ్రామం ౧ కి గ్రామసీమ చిహ్నాలు.

గ్రామాన్కు యీశాన్యభాగమందున వట్టిచేరుకూరు ముట్నూరు కూడల్ని జొన్నలగడ్డ దక్షిణ మూత్తి౯ సోమయాజులు గారు వేయించ్చిన కుంట్ట చిహ్నా. అక్కడ నుంచ్చి తూపు౯ ముఖమయి నడవగా పులిచింతల కుంట పడియ చిహ్న. అక్కడ నుంచ్చి ఆగ్నేయముఖముగా ముట్నూరి చరువు దాటి దక్షిణముఖమేపోగా ముట్నూరు కొలి౯మల౯ కూడలి, ముంమ్ములు కుంట్ట పడియం, శంఖ చంక్రాత్కితమైన యర్రరాతి కుంట్ట చిహ్నా. అక్కడ నుంచ్చి పడమటి ముఖమయి నడవగా కొలి౯మల౯ తెరువుదాటి నైరృతి ప్రతీచిముఖమై నడవగా కాలి౯మల౯, మల్లారి కూడలి రాళ్ల కుంట చిహ్నా. అక్కడనుంచ్చి వుత్తరముఖమై నడవగా, వల్లూరి మంగ్గిపురం, కూడలి యర్రరాతి కుంట్ట వడియచిహ్న. అక్కడ నుంచ్చి వుత్తరముఖమై నడవగా వంగ్గిపురం తెరువుదాటి ఉత్తరముఖమై నడవగా నౌపాటి తెరువులో పిల్లికుంట్ట చిహ్నా. అక్కడ నుంచ్చి పడమటి ముఖమయి నడవగా మూలకుంట్ట చిహ్నా. అక్కడనుంచ్చి వుత్తరముఖముయి నడవగా వంగ్గిపురం చెర్కూరు కూడలి చిహ్నా. అక్కడనుంచి ఉత్తరముఖమై నడవగా మూల కుంట్ట తెల్లపొద చిహ్న. అక్కడ నుంచి తూపు౯ ముఖమై నడవగా జంమ్మకుంట వడియచిహ్న. అక్కడనుంచ్చి తూపు౯మఖమై నడవగా జచ్చుకుంట్ట వడియె చిహ్న. అక్కడ నుంచి తూపు౯ ముఖమై నడవగా చెర్కూరు తెరువు దాటిపోగా మంగ్గలకుంట్టవడియ నడవగాద... దపు కట్ట మీదుగా చిహ్న. అక్కడనుంచి తూపు౯ ముఖమై నడవగా యీశాన్యమూలను సోమయాజులుగారి పేరను వేయించ్చిన కూడలి పెద్దకుంట్ట చింహ్న."

ఏతాషాంమధ్య పత్తి౯ క్షేత్రం॥ స్వదత్తాద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనం। పరదత్తా పహారేణి స్వదత్తాం నిష్ఫలం భవేత్ ౹ స్వదత్తాంపరదత్తాం వాయోహరేతు వసుంధరాం ౹ షష్టివష౯ సహస్రాణి విష్ణాయాం జాయతే క్రిమిః ౹

ఆన ౧౮౧౨ (1812 A.D) సంవత్సరం ది౧౫ తేది ఆంగ్గిరస నామ సంవ్వత్సర కాతి౯క శుద్ద ౧౧ ఆదివారం.

మ్మై

క్రోఫిల్ము నెంబరు : 3,
మె. వాల్యూము : 22
పోలియో : 15 B - 16 B.