పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93

జానంచుండూరు

కై ఫియ్యతు మవుంజే జానంచుండ్డూరు సంతు గుంట్టూరు

సర్కారు మృత్తు౯జాంన్నగరు తాలూకే రాచూరు.

యీ గ్రామాన్కు పూర్వం నుంచి జానంచుండ్డూరు అనేపేరు వుంన్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజు ప్రభుత్వం చేశేటప్పుడు వీరి దగ్గర మహాప్రధాను లయ్ని గోపరాజు రామంన్నగారు. శా ౧౦౬౭ శకం (1145 A D) మంద్దు బ్రాంహ్మణులకు గ్రామ మిరాశీలు నిన౯యించ్చే యడల గ్రామానకు పిల్లలమర్రివారు అనేటి వెలనాడు కాస్యపగోత్సలకు యెకభోగంగ్గా అందుకరణీకపు మిరాశి యిచ్చినారు గన్కు వారు ఆ మిరాశీలు అనుభవిస్తూ గ్రామానకు ఆజ్ఞ్నేయ భాగమంద్దు విష్ణుస్తలం కట్టించి వేణుగోపాలస్వామి వారు అనే విష్ణుమూత్తి౯ని ప్రతిష్ఠ చేసి యీ దేమునికి నిత్యనై వేద్యదీపారాధనల్కు కు ౧ భూమి యినాము యిచ్చినారు అని చెప్పినాడు.

వడ్డేరెడ్డి కనా౯టక ప్రభుత్వములు శా ౧౫౦౦ శకం (1578 A. D ) జరిగిన తర్వాతను కొండ్డవీటి శీమ సముతు బందీలు చేసేటప్పుడు యీ గ్రామం గుంట్టూరు సంతులో దాఖలు చేసినారు.

స్న ౧౧౨౧ ఫసలీ (1711 A. D.) వర్కు చవుదరు. దేశపాండ్యాల పరంగ్గా అమాని మామలియ్యతు జరిగినది గన్కు అప్పట్లో దేవాలయమునకు అచ౯స జరగక ఖిలపడ్డది.

స్న ౧౧౨౨ ఫసలీలో (1712 A. D.) జమీదాల౯కు మూడు పంట్లు చేసి పంచి పెట్టె యడల యీ గ్రామం రమణయ్య మాణిక్యారాయునిం గారి యొక్క వంట్టులో వచ్చి రేపల్లెల తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు రమణయ్య గారు మల్లంన్నగారు శీతంన్నగారు, గోపన్నగారు, జగ్గంన్నగారు, స్న ౧౧౮౨ ఫసలీ (1772 A D.) వర్కు ప్రభుత్వం చెశ్ని తరువాతను జంగ్గంన్నగారి తమ్ములయ్ని తిరుపతి రాయునింగారు సదరహి ఫసలీలో తాలూకా సఖం పంచ్చుకునే యడల యీ గ్రామం తిరుపతి రాయునింగారి వంత్తు వచ్చి రాచూరి తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు తిరుపతి రాయునింగారు వీరి కొమారు లయ్ని అప్పారాయునింగారు, శీతంన్నగారు స్న ౧౨౦౮లా ఫసలీ (1798 A D.) వర్కు ప్రభుత్వం చేశి నిస్సంత్తుగా పోయిరి గన్కు జంగ్గంన్నగారి కోమారు లయ్ని భావంన్న కొన్ని సంవ్వత్సరములు ప్రభుత్వం చేశిన తర్వాతను కుంఫిణీవారు రాచూరి తాలూకా యాలం వేశిరి గన్కు రాజా మలరాజు వెంక్కట గుండ్డంరాయునింగారు కొనుక్కొని స్న ౧౨౧౨ ఫసలీ (1802 A D.) లగాయతు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. శుక్ల నామ సంవత్సరంలో అకలంక్కం వెంక్కటాచార్యులు గారు అనే శ్రీ వైష్ణవుడు మజ్కూరిలో అంత్తరుపు పడివున్న విష్ణుస్తలం పునహాకట్టించ్చి శ్రీ స్వామి వార్కి ప్రతిష్ఠ చేశినాడు.