పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

చముళ్లమూడి

కైఫియ్యతు మౌజె చముళ్లమూడి, సంతు, గుంట్టూరు

సర్కారు మృతు౯జాంన్నగరు, తాలుకె సత్తెనపల్లి

యీలాకె రాజా మానూరి వెంక్కట రమణయ్యారావుగారు

యీ గ్రామాన్కు పూర్వంనుంచ్చింన్ని చవుళ్లమూడి అనే పేరు వుంన్నది. గజపతివారు రెడ్లు ప్రభుత్వములు జర్గిన తర్వాతను తిర్గి గజపతివారు ప్రభుత్వాన్కు వచ్చి లాంగూల గజపతిగారు మొదలుకొని ప్రతాపరుద్ర గజపతి పర్యంత్తరం ప్రభుత్వంచేశ్నె మీదట యీ గజపతిగారి కుమారుడయ్ని వీరభద్ర గజపతిగారు ప్రభుత్వంచేస్తూవుండ్డగా ఆనెగొంద్ది నరపతి శింహ్వసనస్తుడయ్ని కృష్ణదేవరాయలు యీతూపు౯ దేశముల్కు విచ్చేశి గిరిదుగ౯ స్తలదుగ౯ మలు అంన్ని సాధించ్ని శాలివాహనం ౧౪౭౦ (1515 A. D) అగునేటి యవసంవ్వత్సర మంద్దునను కొండవీటి దుగ్గ౯ంపుచ్చుకొని గజపత్ని పట్టుకుని అభయదానంచేశి విడిచ్నివారై యీదేశములు ఆక్రమించ్చుకుని ప్రభుత్వంచేస్తూ యీకొండ్డవీటిశీమలో బ్రాంహ్మణుల్కు ఆగ్రహరములు మొదలయ్ని ఖండ్రికలు ధారాగ్రహితంచేశ్ని వారైనారు గన్కు యీచముళ్ల మూడి అగ్రహరం చేశ్నివయ్నిం.

రాచకొండసూరుదీక్షితులుగారు బృంహ విద్వాంసులుంన్ను తపః సంపన్నులుంన్ను అయివుం ద్దురుగన్కు రాయులవారు వీర్ని చాలాసన్మానించి వీర్కి పుత్రపౌత్ర పారంపర్యా శాశ్వతంగా జీవనం జరుగగలందుల్కు అష్టభోగ సహితంగా ఆగ్రహరంచేశి చముళ్ళమూడి స్వస్తిశ్రీ శాలివాహన శకవష౯౦బ్బులు ౧౪౪౧ (1519 A.D) ప్రమాధి సంవ్వత్సరమంద్దు ధారాగ్రహితం చేసినారు గన్కు సూరుదీక్షితులుగారు కుటుంబ్బ యుక్తముగా అగ్నిహోత్రములతోటి చముళ్ళ మూడి ప్రవేశించ్చి గృహనిర్మాణములుచేసుకొని అగ్రహరం బస్తీచేశి నిరాతాంన్నదాన పరులై యాగాద్యనుషాది సత్కిృయలు జరుపుకొంట్టూ పయ్నివాన్ని శకం మొదలుకొని కృష్ణరాయలు అచ్యుతరాయలు, సదాశివరాయలు, రామరాయలు, శ్రీరంగరాయలుగారి ప్రభుత్వం శాలివాహనం ౧౫౦౦ శకం (1578 A.D) వర్కు అనుభవించ్చినారు——

తదనంత్తరం దేశంమ్లేచ్చక్రాంతమయ్ని తర్వాతను పాదుశాహిలు సర్కారు సముతు బంద్దీలు మొదలయి ఖాయిదాలు యేప౯రిచే యడల యీ గ్రామం గుంట్టూరు సమతులో దాఖలుచేస్నివారై పయ్ని వాన్ని సూరి దీక్షితులుగారి మనుమలయ్ని తిరుమలదీక్షితులుగార్కి యీచముళ్లమూడి అగ్రహారమువాసి యిచ్చిరిగన్కు యీసూరు దీక్షితులుగారు అనుభవించ్ని తర్వాతను వారి కొమారులయ్ని రామసోమయాజులుగారు అగ్రహారం అనుభవిస్తూ గ్రామాన్కు. వుత్తరం యీశాన్యభాగమంద్దు శివాలయం కట్టించ్చి ఆయనలోవయ్నిం కాశీకి వెళ్లి లింగాన్ని తీసుకొనివచ్చి వుంన్నారుగన్కు ఆలింగమూత్తి౯ని ప్రతిష్ఠ చేశి చంద్రశేఖర స్వామి వారనేనామం యేప౯రచి నిత్యనైవేద్యదీపారాధనల్కు జరుగగలంద్గుకు కుచ్చల భూమి మాన్యం యిప్పించినారు