పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొడవర్రు

79


రార్యులు గారికి శ్రీమద్రాజాధి రాజ మహారాజ రాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప కృష్ణదేవమహారాయులుంగారు కొండ్డవీటి రాజ్యములో చేరినగొడవత్తి౯ గుండ్డవరం, యీ రెండ్డు గ్రామాలు అష్టభోగ సహితంగా దానధారాపూర్వీకముగా అగ్రహారములు చేశి తామ్ర శాసనములు వాయించి యిప్పించి ధారాగ్రహీతం చేశిరిగన్కు వెంకటేశ్వరార్యులు విజయనగరంన్నుంచి వచ్చి కుటుంబ్బ యుక్తముగా అగ్నిహాత్ర ములతో కూడా గొడవత్తి౯ గుండ్డవరములు అగ్రహారములలో ప్రవేశించ్చి గృహనిర్మాణములు చేస్కుని యాగాధ్యనుష్ఠానాది సత్క్రియలు జరుపుకుంట్టూ నిరతాన్నదాన పరులైన సదరహిశకములగాయతు శాలివాహనం ౧౫౦౦ శకం (1578 A. D) వర్కు కృష్ణరాయుల అచ్యుతరాయలు, సదాశివరాయులు. రామరాయలు శ్రీరంగ్గరాయలు, వారి ప్రభుత్వం వర్కు అనుభవించ్చినారు.

తదనంతరం దేశంమ్లేచ్ఛాక్రాంత్తమాయ గన్కు పయిని వాశ్నిన్ని వెంక్కటాచార్యులు గారి కుమాళ్లు ఆయ్ని అన్నప్ప అవధానులు, అయ్న కొమారుడు వెంక్కటనారాయణ, యీయన కొమారుడు వుపేందృడు వెంక్కటనారాయణ వీరలకు పాదుషాహాలు అయ్ని మల్కి విభురాం సుల్తాను అబ్దుల్లా తానేషా అలంగ్గిరు మొదలయినవారు శాసనపత్రికలు విచారించ్చి అవిచ్ఛిత్తుగా జర్గించినారు. సదరహి మొగలాయీ ఆరంభంలో యీగ్రామాదులు రెండుంన్ను గుంటూరు సంతులో దాఖలు చేశినారు. స్న౧౧౨౨ ఫసలీ (1712 A. D)లో కొండ్డవీటి శీమ మూడు వంట్లు చేశి జమీదాల౯కు పంచ్చిపెట్టే యడల యీగ్రామాదులు రమణయ్యామాణిక్యరాయు నింగ్గారు ప్రభుత్వం చేస్తూ పయిని వాన్ని అగ్రహారీకులయ్ని వెంక్కట నారాయణ కొమారు డయ్ని రామ కృష్ణంమకొడుకు పాపరాజుకు వంత్తువచ్ని రేపల్లె తాలూకును దాఖలు అయ్నిది గన్కు రమణయ్యగారు యీఅగ్రహారంకు పొలం ౧ కి వో ౫ వరహాలచొప్పున శ్రొత్రీయంగ్గా యెప౯రిచి రమణయ్యగారు మల్లంన్నగారు, శీతంన్నగారు రామంన్నగారు సదరహి ఫసలీ లగాయతు న్న ౧౨౧౬ ఫసలీ (1806 A.D.) వర్కు సావరాల్కు అగ్రహారం జర్గించ్చినారు.

తదనంతరం పయిని వాశ్ని శీతంన్నగారి కొమారుడయి జంగ్గంన్నగారు ప్రభుత్వాన్కు వచ్చిరి గన్కు వీరి, దివాను అయ్ని కాటం రాజు వెంక్కట పంత్తులు అగ్రహారీకులమీది గిట్టమి చాతను అగ్రహారములు నడవకుండ్డా చేశినారు గన్కు పయ్ని వాన్ని పాపరాజు కుమారుడయ్ని వెంక్కటాచలం, పుపేంద్రుడి మనుమడయ్ని వెంకట రాయుడు వీరు కరణీక ధర్మం జ్ఞాతి వగ౯ంతో కూడా అనుభవించ్చిరి గన్కు వారి కొమాళ్ళు అయ్ని అచ్చంన్న వెంక్కటేశం అనుభవిస్తూ వుంన్నారు. సదరహి జంగంన్నా మాణిక్యరాయునింగారు సదరహి ఫసలీ లగాయతు స్న ౧౧౮౨ ఫసలీ (1772 A.D.) వర్కు పద్నాల్గు సంవత్సరములు ప్రభుత్వం చేశ్నీ తాల్కు తమ్ములయ్ని తిరుపతిరాయునింగారు కలతపెట్టిరి గన్కు తాలూకా చేరి సఖంగ్గా పంచ్చుకునే యడల గొడవర్రు జంగ్గం మాణిక్యారాయునింగారి వంత్తు వచ్ని రేపల్లి తాలూకాలో దాఖలు అయ్నిది. జంగ్లంన్నా మాణిక్యరాయునింగారి వంత్తు వచ్చ్ని గోడవత్తి౯కి, స్న ౧౨౦౧ ఫసలీ (1791 A.D.) వర్కు వారి ప్రభుత్వం జరిగినంతట వారి కొమాళ్లు అయ్ని భావంన్నా మాణిక్యరాయనింగారు ప్రభుత్వానకు వచ్చినారు. మజ్కురి కరణమయ్ని అన్నంభట్టాన్వయ ప్రతినామ ధేయమయ్ని గుండ్డవరపు వెంక్కటేశం ప్రభవ సంవత్సర