పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు.

67


పరగసీమకు ముంన్ను పాతిన బోగాలు
యిసుమును లాసుర్రు పైరు నలువ (మరియు)
కట్టిన కట్టలు కొడ్నభావులు
కూపముల తటాకవనము
యిందులో నసమెతటనే కట్టి నేమయు
లేకుంన్న పల్లెలందు...చుట్లపట్లున్న ప్రభులు సాక్షిగాగ
ప్రతిపట్టినపుడేమీ తెలసి నరుడు నడువవలయు !!
సాక్షులకు !!

పుత్రీ పుత్రహీనుని భృష్ణుని కృష్ణుని సంగహీనుసింధునాటదాని బదిర ప్రొందుంగు...బాలుని గుణహీనుసాక్షి సత్యములకు జనధునడ్మలో!! ధారాదత్తము దత్తపుత్ర క్రయములన్ దౌహిత్రమున్ భోగ్నములన్.

పారంపర్యము జ్ఞాతి లబ్ధమును మార్చెనట్టి సమ్మతోద్ధారోంశంబును రాజుదత్తియును వజదత్తిం జైనకంన్నాలిపరి సహయ సంప్రతి యదృశ్యంబున్నది కుంస్థితులూ గోరంట గరికిపాటను నడిచిన పూర్వవృత్తాంతం శ్రీయీరెడ్లు అగ్రహారములు యిచ్చి భూమి యేలి చనిన తదనంతరమందునను కృష్ణదేవరాయలు యేలెను. యీయన యేలుబడిలోను రెడ్లు యిచ్చిన అగ్రహారాలు నడిపించకపాయను. శీమలు కర్ణాటకంకింద కల్సుకొని గ్రామాదులు కొంన్ని శీమలకింద కల్పుకొని బెల్లంకొండ గ్రామాదులు ఇరువయినాలుగు గ్రామాదులు అడ్సుపల్లి వారు అనే కంమ్మవారికి కొల్వుబడి కిందను మొకాసా యిచ్చిరి. గనుకను యీ అడ్సుపల్లి వార్కి యిచ్చిన గ్రామాదులల్లోను రెడ్లవారు యిచ్చిన ఆగ్రహారాదులు గోరంట గరికిపాడు చిలుకొండ గామాదులలో కల్పియిచ్చినారు గనుకను యీ అడ్సుపల్లి వారు యేలుచూవుండి తదనంతరమందునను రెడ్లవారు యిచ్చిన అగ్రహారములు నడిపించకను యీ అగ్రహారము పూండ్లవారికి కృష్ణదేవరాయలు చేను పెత్తనం కరిణీకపు మిరాశీలు యిప్పించి అగ్రహారాలు నడువదాయను గనుకను గరికిపాటి వారిని మల్లాదివారు అందురు. యీ రెండు గ్రామాదులవారు తమ... కృష్ణదేవరాయలు తిర్గి అగ్రహారాలు యిచ్చినట్టు గాను దొడ్లేటికంసాలెవారి చాతను గరికిపాటివారి పలుకులు రాగి పలకలు అయిదుచేయించి రాయలు యిచ్చినట్టుగాను శాసనం వాయించిరి గనుకను గోరంటవారు పలుకులు చేయిస్తూ వుంన్నారు గనుకను ఆదొట్లేటిలోను చేయించగాను యీ అడ్సుపల్లివారికి అశ్రితుడు అయి వుండి తెలగాణ్యులు యోలూరివారు అని బ్రాహ్మణులు వచ్చి అడ్సుపల్లివారితో చెప్పిరి. గనుకను అడుసుపల్లెవారు రాయలవారితోను యేమాటచెప్పినా విని అంటువుండే గనుకను యీకృష్ణదేవరాయల్కు యెరుక పరచి చేసిన అగసాలెవాణ్ణి తెప్పించిరి గనుకను అగసాల వాడు గరికిపాటి బ్రాంహ్మణులకు చేసి యిచ్చినారు గోరంటవారు చెయ్యమంటే చేస్తూవుంన్నాను అనిచెప్పి గనుకను యీరు గోరంటవారు పల్క చేయించినారు. అని యేమి వుపద్రవము వచ్చునో అని దేశాంతరులు అయిపోయిరి. వీరు దేశాంతరులు ఆయిపోతేను యీగోరంట రెండు భాగములు చేసి యీ అడ్సుపల్లి వారు ౧ భాగం, వకభాగం కౌండిన్య గోత్రులయ్ని యోలూరువారు తనకు ఆశ్రితుడు గనకను యీయేలూరి వార్కి శోత్రియం యిచ్చిరి. ఆగ్రామం లేఖపత్రము వాయను యీఅడ్సుపల్లివారు కట్టమూరివారి కరణాలు అయ్ని నియ్యేగులు చాతను కరణీకం వాయించిరి.