పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

59


గనుకను ఆమంత్రయ అర్ధసంచితుడు గనుకను కొండకావూరు యిరుజేవల్లి పదహరు వీసాలు చేసి ఒక్కొక్క వూరు కొండ్డకాపూరు... క్రయగరం గురుజెపల్లి క్రయం యేక్రయగరం కూడా ౧౬౦ వరహాలకు రెండు గ్రామాదులు మిరాశీలు క్రయంచేశి పుచ్చుకొనెను. విప్పర్ల కరణాలు ప్రధముల తోరణాలువారు అనేటివారు... విప్పర్ల యిచ్చెము అని అంటిగరం యనబై ౮౦ వరహాల్కు యాకసంప్రతి అని కోరెను. తొండపి యేక సంప్రతి వెలనాడు సంప్రతి యిచ్చి క్రయగరం యీ నాల్గు గ్రామాలు అంమ్ముకొని వారు దేశాంతర్లు అయిపోయిరి గనుకను కెండిందింబ్బ నారపరాజు అనే అతడు పాకనాడు విరితసగోత్రుడు చిలుకూరు నంది గ్రామం రెండు క్రమముగ ౮౦ భీమవరం ౧౬ం యీవాశినక్రయంగ ౮౦ భీమవరం క్రయం ౬ం యీ ౩ న్ను క్రయంగ ౧౪౦ కి ఆకౌండిన్య గోత్రుడయిన మంత్రయ అమ్ముకొని దేశాంతరుడై ఆయెను. గాదలవర్రు కరణీకం ప్రధుములు కౌండిన్య గోత్రులు యీప్రథుముడు అని మాచిరాజు అని అతడు మండూరి కరణం మతుకుపల్లి నాగరాజు అని అతన్కి. తన యాకభోగం సంప్రతి సగభాగంగ ౪౦ నలుభయి వరహాల్కు అమ్ముకొని దేశాంతరుడు అయ్యెను. తమ్మవరం బొమ్మకంటి సుందరయదిడుగు కాశేపాళ్లు రెండున్నూ మాదిరాజు కృష్ణంరాజుకొని తమ్మవరం సభాగం పాతికే క్రయంకొన్న పాతికెలు రెండు యీదిగుడు భాగం కొంన్ని బొమ్మకంటి సుందరయ అనుభవించెను. దిడుగుభాగం పాతికే క్రయం పాతికెలు రెండు అయితవరం తన భాగం పాతికె కాశీపాడు క్రయం యేక సంప్రతి యీమూడు గ్రామాదులు యీ మాదిరాజు కృష్ణంరాజుకొని అనుభవిస్తూవుండి తదనంతరమందు యీ బొమ్మకంటి సుందరయ్యకు దొడ్డవిప్పత్తువచ్చి నిరవహించలేకను యీ సుందరయ పరాశర గోత్రులైన మార్కు వారు అనేటివారికి అంమ్ముకొనెను. తంమ్మవరం తనభాగం మూడు పాతికెలుగ ౫౦ కు అంమ్ముకొని యితడి అయిన దిడ్డుపాతికె వుండెను. తంమ్మవరం పాతికె మాదిరాజు కృష్నంరాజుకు వుండెను. చికితస గోత్రులయ్ని కొణిదెం బాక వారి సంప్రతి పూసపాటి వారు అనేటి వార్కి క్రయానకు ౭౫ అమ్ముకొనిరి. భూమారుజయవరాజులు రెండు గ్రామాదులు కౌండిన్య గోత్రులయ్ని శానంపూడి రాగరాజులు అనేటి అతను భారద్వాజ గోత్రుడైన ధూళిపూడి కరణం గంగరాజు అనేటి అతను భారద్వాజ గోత్రుడైన ధూళిపూడి కరణం గంగరాజున్కి రెండు గ్రామాదులు నూటనలుబై వరహాల్కు అంమ్ముకొని దేశాంతరు లయిరి. దావరపల్లి కరిణీకం సంప్రతులు రెండింటికి సంప్రతి వీసాలు యెన్మిదింటి చొప్పు సాల్కు పదారింటికి చేసుకొని యీ చామరపల్లిలోను సగం సంప్రతి పడమట గోరంట బ్రాహ్మడు హరితస గోత్రుడు మల్లాది తిరుమలభూ స్తితిని అతనికి అంమ్ముకొనిరి. పెదమద్దూరు వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రుడు వీరిని మువ్వారవారు అందురు. శింగయఅనేఅతడు శ్రీ దంత్స గోత్రుడైన దామరాజు గంగరాజు అనే అతనికి క్రయంగ ౬౦ కు అమ్ముకొని దేశాంతురులై పోయెను. అమర్తలూరిలోను పులిప్పాకవారు హరితసగోత్రులయిన సంప్రతిలోను వీసరి భారద్వాజ గోత్రులయిన సాయినివారిని సంప్రతిలోను సాహని వారు అని ఆతడు పులిపాక కాళ్ల వెంక్కంన్న అనే అతడు వీరు యిద్దరున్ను మాచళ్ల వరవు కరణంకు అడ్డగడజన్ను వెంక్కంన్న అనే అతనికి అమ్ముకొని వీరు అయిదు వరహాలకు పొడుమధర్కకు పది వరహాల్కు అంమ్ముకొని సాలుని రామయప్పపులిపాక కాళ్ల ... వెంకన్న యిద్దరున్ను దేశాం తురులయిపోయిరి పెడచెరుకూరు బ్రాంహ్మణులు కొనరాజులువారు అనేటి వారికి ... నియ్యోగల్కు వుంచి పోయిరి. పొరువగుట్కి నందవరీకలును దివివారు అనేటి వారింన్ని వుంచి