పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

గ్రామకై ఫియత్తులు


కరిణీకపు స్థావరాలు వుండి చేసి యీ రెడ్డి యిచ్చిన గ్రామాదులవారికి యేవూరివార్కి ఆవూరు యజమాన పెత్తనం యిచ్చెను. యీయజమాని పెత్తనం రాయదత్తివారు అందురు. బలభద్ర పాత్రునివార్కి స్థానికకరిణీకం వచ్చిన మచ్చట యీరాయలదేవుని యేలుబడి కొండవీటిశీమకు స్థలకరిణీకము సంప్రతి ౧ వీరిని సంపుటంవారు అందురు. యీసంపుటం కోనప్ప అనిపడు పెత్తనంచేశెను. గుర్రంబలభద్రయ్య అనే అతడున్ను నుదురుపాటియర్రయ్య అనీ అతడున్ను నుదురుపాటియర్రయ్య అనే ప్రధముడున్ను వారు యిద్దరున్నూ అన్యోన్య స్నేహంచేతను పరమహంసులు కలసి అనుసరపక్షంచేశి అంన్ని స్తంభన విద్య నేర్చుకొని వచ్చి యీసంపుటం కోనప్ప దగ్గిరను చాకిరివుండి కొన్ని దినములు జరిగినంతలో తమకు స్థలకరిణీకం వున్నదని ఆకోనప్పతోనూ కలహంచేశి తమకు లేదు అని ఆకోనప్ప ప్రమాణంచేస్తెను. విడిచి పెట్టము అని ఆపక్షానకు మాకు భాగం వున్నది. మేము విడిచిపెట్టము అని గుండా తనం చేశిరి. గనుకను ఆసంపటం కోనప్ప వీండ్లు గుండాలు వీండ్లతో తగూకు (తగపుకు) యేమనిపోను ప్రమాణం యేమని వప్పను పెద్దతనం నిల్వదు వీండ్లు బహుగుండాలు. యీ పెత్తనం లేకున్నామానె వీండ్ల చేత ప్రమాణంచేశి గెలిస్తేను నేను పెత్తనంచాలిస్తున్నాను అంన్నది మంచ్చిది వీండ్లవలెను తాను గుండాతనం చేస్తే పెద్దతనం లేకపోతున్నదని విచారించి ఆకోనప్ప మీకుస్థలకరణీకం వున్నదని కదా మీరు ప్రమాణం చెయ్యమనేది మీకు కద్దని ప్రమాణం చేశి తెల్చి పెత్తనం మీరు చెయ్యండి తాను పెత్తనం చాలించుకుంటాను అనెను గనుకను యీబలభద్రయ్య యరయ్య యిద్దరున్ను ఒప్పి ఆగ్నిహాత్రములోను కర్రమండు పరమహంసక్రియి పెంపునను మండ్డుగెలిచిరి గనుకను ఆకోనప్ప పెత్తనం చాలించుకొనెను. బలభద్రయ్య యర్రయ్య యిద్దరున్ను దేశ పెత్తనం చేశిరి. వీరిని బలభద్రపాత్రుడు యర్రాపాత్రుడు అనిరి గనుకను బలభద్ర పాత్రునివారు యరాపాతృనివారు అని అందురు. యీగుర్రం బలభద్రయ్య తెలగాణ్యుల కౌండిన్య గోత్రుడున్ను నుదురుపాటి యర్రయ ప్రధముడు భారద్వాజ గోత్రుడు స్థలకరిణీకం యీరీతిని సంపాయించిరి. యాదాస్తు ఆసంపుటంవారు తెలగాణ్యులు కౌండిన్య గోత్రులు యీసంపుటంవారికిని పెళ్లారివారు అనునామాంకితం ఆయెను. గజపతిరాజు తిరిగి దళం కూర్చుకొని వచ్చుట యీకృష్ణ దేవరాయలు యీచొప్పన యేలి గజపతి వారిని సాధించి రాజ్యంతీసుకొని బ్రాంహ్మణులకు వృత్తులు యిచ్చి ధర్మంనడిపించికొంన్ని వర్షంబులు యేలి కృష్ణదేవరాయలు చనెను. అతనంతరమందునను గజపతివారు బలువు పైరి యీరాయలు కొండవీడు హవేలివుంచి వినికొండ బెల్లంకొండలు ౨ న్ను పరగణాలు చేసి నిమకాళా శీమలు ౧౧ న్ను కర్ణాటకం కిందకల్పినారు గనుకను యీగజపరులు కర్ణాటకం కింద కలిపిన శీమలు కొండవీడు వినుకొండ బెల్లంకొండ నాగార్జునకొండలు గజపతివారు తిరిగి తీసుకొని పోవలెనని దశంచేసుకొని వచ్చిరి. గనుకను రాయలువార్కి బలుపులేక యుండే ఆసమయ మందున గజపతివారికి యెదురులైరి గనుకను కృష్ణదేవరాయలు చనిపోయిన వెనుకను బలువులేదు గనుకను అల్లసాని పెద్దన జీవంతుడై వుండేగనుకను యీశీమలు గజపతివారు ఆక్రమించుకొని పొయ్యె పనివచ్చెను. సంస్థానములోను బలుపు లేదాయనని విచారించి గజపతివారికి వుత్తరం వాయించి పంప్పించెను......