పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

45


గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు 3౮౦ జువ్వలకల్లు వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు ఖండవీలు ౧౦౮౦ కైతేపల్లి వెలనాడు సంప్రతులు ౨కి గౌతమ గోత్రుల సంప్రతి ౧ కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦౦ తూర్పు దొండపాడు వెలనాడు సంప్రతి ౧ వీరిని మచ్చివారు అందురు. ఖండ వీలు ౨౪ ధూళిపూడివెలనాడు సంప్రతి ౧ వీరిని బెజ్జరాజు వారు అందురు. తోటపల్లి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ మొండేరు ౧ ఆముదాలపల్లె ౧ గోతిక ర్ణేశ్వరం ౧ ప్రజ్ఞామల అడవులదీవి ౧ వొదుమెంక ౧ యేలేరు ౧ అల్లపర్రు ౧ అల్లపట్ల ౧ ముత్తుపల్లి ౧ యీదుపల్లి ౧ పెదయడ్లపూడి ౧ అట్లూరు ౧ కావూరు ౧ చెరుకుపల్లి ౧ ఆరేపల్లి ౧ పూండ్లిపాడు ౧ సంగరం ౧ కొమరకోలు ౧ రాజవోలు ౧ శిరిపూడి ౧ బలుసులపాలెం ౧ పెదపల్లి ౧ యీ యిరువై నాలుగు గ్రామాదులు కుర్రువారు అనేటివారికి యేక సంప్రతిగాను యిచ్చి ఆరేపల్లిలోను రెండు సంప్రతులు శ్రీవత్స గోత్రులయిన నోళాల వారి కిచ్చినను చందవోలు సంప్రతులు ౨కి ప్రధములు సంప్రతి ౧ వెలనాడు సంప్రతి ౧ ఖండవీలు ౪౪ం ఆమర్తలూరు సంప్రతులు ౨ కి వెలనాడు హరితస గోత్రుల సంప్రతులు ౧ వీరిని పులిపాకవారు అందురు. కరణకంమ్మల సంప్రతి ౧ ఖండవీలు ౨౪౦ బాపట్ల వెలనాడు సంప్రతి ౧ వుపవెట్ల వెలనాడు సంప్రతి ౧ పెరవలి వెలనాడు సంప్రతి ౧ భిన్న అయివున్నది. గణపవరం వెలనాడు సఁప్రతి ౧ పేరాల వెలనాడు సంప్రతి ౧ అడుపలు వెలనాడు సంప్రతి ౧ కడకమరు వెలనాడు సంప్రతి ౧ పెదగంజాం వెలనాడు సంప్రతి ౧ కొండ్డ కోడూరు వెలనాడు సంప్రతి ౧ గౌతమ గోత్రుల చవడవరం వెలనాడు సంప్రతి ౧ వీరిని బల్లి కుర్వ వారందురు. ఖండవీలు ౮౦ దేవరంపాడు వెలనాడు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వెల్కపూడి వెలనాడు భారద్వాజగోత్రుల సంప్రతి ౧ కంత్తేరు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు వుత్తరనారాకోడూరు యీ రీతిగాను యీ హవేలీ గ్రామాదుల సంప్రతులు గణకస్థావరాలు గోపరాజు రాంమన్న నియ్యోగుల యిచ్చెను. (మాత్మభిన్నం అయివుండగా మధ్య మధ్యను వ్రాయక విడుస్తూ వచ్చినాను) దక్షిణ తుర్ల పాడు కౌండిన్య గోత్రుల సుప్రతి ౧ తెలగాణ్యులు వీరిని సంపుటం వారు అందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬౦ బుక్కాపురం సంప్రతులు ౨ కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ తింమ్మాపురం ౧ అప్పాపురం ౧ బాబాపురం ౧ నోబిల్లపల్లి ౧ గార్లపాడు ౧ నాగులపాడు ౧ బుస్సాపురం వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ వీరిని నారాయినివారందురు, ఖండవీలు ౪౦ చోడపాడు ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వీరిని పొనిపాకలవారందురు. ఖండవీలు ౧౬౦ ముక్కలమెర్రు ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వీరిని పాకాలవారు అందురు. ఖండవీలు ౧౮౦ పోతుకట్ట ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని మద్దిపట్లవారు అందురు. ఖండవీలు ౧౦౦ కొరుతవారు ప్రథముల సంప్రతి ప్రథముల కౌండిన్య గోత్రులు వీరిని చందలూరివారు అందురు. ఖండవీలు నేపాడు ప్రథములు సంప్రతి ౧ పల్ల పాడు ప్రథముల సంప్రతి ౧ గొట్టిపాడు ౧ కొండజాగర్లమూడి తెలగాణ్యులు సంప్రతి ౧ ఖండవీలు ౬౧ కొండకోడూరు వెలనాడు గౌతమగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ చవడవరం వెలనాడు సంప్రతి ౧ వీరిని పిల్ల లమర్రి వారందురు. ఖండవీలు ౮౦ మశివుత్తర గ్రామాదులు యీతముక్కుల గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని చింతరాజువారందురు. ఖండవీలు ౨౦౦ మదనూరు తెలగాణ్యులు గౌతమ గోత్రుల సంప్రతి వీరిని చింతరాచు వారందురు. ఖండవీలు ౩౦౦