పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

గ్రామ కైఫియత్తులు


శీమకు యివి మూడు సంప్రతులు యిచ్చెను. వినుకొండశీమకు సంప్రతులు నంద్దవంశీకులు సంప్రతులు ౨ కి గుంత్తుపల్లి వారు ఆనేటివారికి సంప్రతి ౧ రాయనివారు ఆనేటివారికి సంప్రతి ౧ యీ వినుకొండశీమ సంప్రతులు యిచ్చెను. కొండవీడు హవేలీ శీమకు తెలగాంణ్యులు సంప్రతివారు అనేటివార్కి ఒక సంప్రతి వకటి యిచ్చెను. యీశీమలు ౧౪ కి శీమలు పెత్తనపు మిరాశీ సంప్రతులు వీరికి యిచ్చెను. హవేలీ గ్రామాదులకు యిచ్చిన సంప్రతులు కొండ్డవీటి సంప్రతులు వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు వీరిని కొండపాటు అందురు. ప్రథములు సంప్రతి ౧ కౌండిన్యస గోత్రులు వీరిని పట్టస్వామివారు అనిరి. కొండలు గాకను ఖండవీలు ౪౦౦ యాంబలూరు వెలనాడు సంప్రతులు ౨ కి గౌతమగోత్రుల సంప్రతి ౧ వీరికి గ్రామనామము కౌండిన్యస గోత్రుల సంప్రతి ౧ వీరిని దాంత్తివారు అందురు. ఖండవీలు ౨౦౦ రేపూడ వెలనాడు సంప్రతి ౧ వీరిని చిల్కావారు అందురు. ఖండవీలు ౬౦ దక్షిణ తాళ్లూరు వెలనాడు అందురు. సంప్రతి ౧ హరితస గోత్రులు వీరిని చిల్కూవారు అందురు. ఖండవీలు ౩౮౦ ఫిరంగ్గిపురం యోనాడు సంప్రతి హరితస గోత్రులు వీరిని బల్కావారు అందురు. ఖండవీలు ౮౦ చినతక్కెళ్ల పాడు వెలనాడు సంప్రతి ౧ హరితస గోత్రులు వీరిని చిల్కావారు అందురు. ఖండవీలు ౬ం పెదతక్కిళ్లపాడు వెలనాడు సంప్రతి ౧ హరితస గోత్రులు వీరిని చిల్కావారు అందురు. ఖండవీలు 300 చేముళ్ల కంటి వెలనాడు సంప్రతి ౧ కౌశికగోత్రులు వీరినిగ్రామనామం ఖండవీలు ౧౨౦ పడమటి జంపని ప్రథములు సంప్రతి భారద్వాజగోత్రులు వీరిని గోవాడవారు అందురు. ఖండవీలు ౪ం వేగమూడి ౧ వెలనాడు సంప్రతి ౧ గౌతమ గోత్రులు వీరిని యాబలూరి వారందురు. ఖండవీలు ౨౪ డొంకిపర్రు సంప్రతులు ౨ కి గౌతమగోత్రుల సంప్రతి ౧ వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ గోరిజవారిని పొత్తూరి వారందరు. ఖండవీలు ౧౨౦ సదరు మూడు సంప్రతులు ౪ కి తెలగాంణ్యులు కౌండిన్య గోత్రులు వీరిని పూరేవారందురు. కొప్పర్రు వెలనాడు గౌతమగోత్రుల సంప్రతి ౧ వీరికి గ్రామనామము ఖండవీలు ౧౫౦ సంప్రతి ౧ ప్రథములు సంప్రతి భారద్వాజ గోత్రులు వీరికి -గ్రామనామము నుదురుపాటి వార్భోల ప్రథముల - సరిప్రతులు ౨ కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦౦ అందురు. నందవరీకుల సంప్రతులు ౨ కి కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వీరిని తంగేళ్లవారందురు. జంగాలపుల్వ వెలనాడు కౌశికగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౨౦ కౌండిన్యస గోత్రుల సంప్రతి... వీరిని కోటపల్లె వారందుకు. ఖండవీలు ౪౦౦ తూమాడు తెలగాణ్యులు భారద్వాజగోత్రుల సంప్రతి ౧ వీరిని పువ్వాడవారందురు. ఖండవీలు ౧౫౦ గొరిజపాటి సంప్రతి భారద్వాజగోత్రులు వీరిని గుండ్లవారందురు. ఖండవీలు ౩౮౦ చిరుమామిళ్ల వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గోపరాజువారందురు. ఖండవీలు ౧౫౦ వంకాయలపాడు వెలనాడు సంప్రతి ౧ కౌశికగోత్రులు వీరికి గ్రామము ఖండవీలు ౨౦౦ సొలుసగణికెపూడి ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ కి ఖండవీలు ౪౦ సొలస సంప్రతులు ౪ కి వెలనాడు సంప్రతులు ౨కి గౌతమగోత్ర సంప్రతి కౌశిక గోత్రుల సంప్రతి ౧ చినకూరపాడు పాకనాడు శాడిల్య గోత్రుల సంప్రతి ౧ వీరిని బల్లి కుదురనవారు అందురు. ఖండవీలు ౧౨౦ ప్రథముల సంప్రతులు ౨ కి కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦౦ ముప్పాల తెలగాంణ్యుల కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని సంపుటంవారు అందుకు. ఖండవీలు నక్కలగుడిపాడు ప్రధములు