పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

23


యిచ్చెను. గౌతమస్థానంగాను గుంట్టూరు యిచ్చెను. కశ్యపులస్థానంగ్గాను వంగ్గిపురం యిచ్చెను. జమదగ్ని స్థానంగ్గాను యినగల్లు యిచ్చెను. ఆత్రయస్థానంగాను కారంచేడు యిచ్చెను. వశిష్ట స్థానంగ్గాను వుప్పుటూరు యిచ్చెను. యివి సప్తర్షి సంఖ్యా గ్రామాలు యిచ్చెను. యీపద కొండ్డు గ్రామాదులు ముక్కంట్టి దత్తి అంద్దురు. (fol. 7). యీప్రతాపరుద్రుని యేలుబడిలో వుంన్న గ్రామాదులు:-...యీప్రతాపరుద్రుడు ధరణికోట పెట్టించ్చి ధరణికోటందున్ను కాపురం వుండి యేలుబడిని నియ్యోగుపాగాలు సంపాద్యంచేసి యీయన సంత్తతు కాశికిపోయి గంగ్గలో కుంకులిడి విశ్వేశ్వరుని స్తుతియించి రాజ్యభారాన్ని... శానికి కళతప్పకుండ్డాను వచ్చి శింహ్వాసనా శీనుడై యుండ్డును. యీయ్న ధర్మపత్ని అయ్ని అంబ్బికాదేవంమ్మ ఆమెకు యెదురు లేకుండ్డాను యీయ్న కాశికిపొయ్యెటివాడు వకనాడు నిద్ర మేల్కొని అంబికాదేవమ్మ చూచి యటుపోయి నాడిని విచారించ్చి కనవలెననికాచి కనలేక పోయిన యవలుగాని యీజాడ చెప్పలేరు అని విచారించ్చి యీజయినుల ముంద్దరనడిచే వృత్తాంత్తం అనాగతం చెప్పేటివారు గన్కును అంబికా దేవంమ్మకు చెప్పిరి. అంబికాదేవంమ్మ యీజయినులమీదను చాలా పక్షంగా వుంద్దుగన్కు యీజయినులను పిలిపించ్చి అడిగె గన్కు యీజయినులు విచారించి యీముక్కంట్టి పోయించ్చికూడా అంబ్బికా దేవమ్మకు చెప్పిరి. అంబ్బికాదేవంమ్మ యీప్రతాపరుద్రుడు పోయ్యా గనుపెట్టి తానువచ్చెను అని చాలా బల్వుచేసెను గన్కును అంబ్బికా దేవంమ్మనుబెట్ట బట్టుకుని యోగవాగాలతోనుబోయినంత స్నానంచేసినంతలో అంబ్బికాదేవమ్మ రజస్వల ఆయ గన్కును యీప్రతాపరుద్రుడు చాలా చింతన చేశి యీ అంబికాదేవంమ్మను విడిచిపోరాదు పోక పోతేను రాజ్యం విరొధంఅని ఆకాశీఖట్టులోను వుండ్డే బ్రాహ్మణులు గంఘ్ఘకు స్నానానకు వచ్చి వుండ్డిరి. అప్పుడు వారు వినయంగ్గాను తాను వచ్చిపోయి మర్మము చెప్పేగన్కును ఆకాశీ బ్రాంహ్మణులు విచారించ్చి రజస్వల అయిన స్త్రీ తోకూడాను యోగవాగాలు యోగాలు నడచిన అని విచారించి ఆకాలానకు బ్రాంహ్మణులకు వేదశాస్త్రాలు ఆడినట్టువస్తూ వుండ్డేగన్కును వారుయీరాజుకు వలాడు కంన్నులు వున్నవి. యితడు సాక్షాత్కారమయిన రుద్రహాంశ యితనికి మనం యీదినం యోగవాగాలు నడుపుదాము. వేదశాస్త్రాలు, మనకు యీకలియుగకాలంలోను ఆడినట్టువస్తూ వుంన్నవి అని విచారించ్చి ముందరవచ్చే హెష్యం యెరుక తగిలియుండ్డి ఆబ్రాంహ్మణులు ప్రతాపరుద్రుని తోను ముంద్దర నాలుగు యేండ్లకు మాదేశాన్కు అవాంతరాలురానుంన్నవి. అకాలమంద్దునను మేము మీశీమకువశ్తేను మాకు అంన్నవస్త్రాలు నడిపింతునని యీగంగ్గా గభ౯ మంద్దునను స్నానంచేశి నీవుమాకు ధారాపూర్వకంగ్గాను మీకునడిపిస్తున్నాను అని అంటేను యీదినం మీకు యోగవాగాలు మింమ్మున యిద్దరిని యింట్టికి చేర్చి అట్టినడిపిస్తూ వుంన్నాము అని యింతనుంచ్చి యీ యోగవాగాలు పలిగొనవు అనిరిగన్కును ప్రతాపరుద్రుడుకు ఆమాటకు వప్పెగన్కును వారిదంప్పతులు యిద్దరిని గంగ్గలో స్నానం చేయించి యీప్రతాపరుద్రుని తాము అంన్నమాట గంగ్గలోను ధారపోయించుకుని అప్పుడు తాముస్నానంచ్చేశి ఆశీర్వచనంచేశి మేముసత్యంగాను వేదంచ్చదివితి మాయనా యీ వేద వచనాలు నిశ్చయమయినట్టు ఆయనోమేము సత్యవాదుల మైతిమయనా యీరాజుపత్నిని యీయోగవాగాలు నడిపించ్చుగాకను అని ఆశీర్వచనంచేశి అంబ్బికాదేవంమ్మను తనపతిని ముట్టుకోవచ్చె అట్టుగాను చేశి యీదినమె కాటియిసుక యీ యోగవాగాలు మీకు పనిగొని వుంట వనిరి గన్కు పత్నీసమేతంగ్గాను యీముక్కంట్టి యోగవాగాలు నడిపించ్చుగాకను, వారు