పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

21


బిడ్డ పెండ్లాడి తులాభారంత్తూగి శీమలు కర్ణాటకం కింద్దకల్పి వినికొండ్డ బెల్లంకొండ్డలు పరగణాలుచేశి కొండ్డవీడు హవేలీ ౬ం౦ గ్రామదులు వుంచ్చి ౫౮ సంవ్వత్సరాలు యేలిచనెను.

ఆటుతర్వాతను రామదేవరాయలు ౧౫ సంవత్సరములు యేలెను. అల్లుడు రామరాజు ౧౨ సంవత్సరాలు లాంగ్గూలగజపతి ౩౮ సంవ్వత్సరములు నరశింగ్గరాయలుని జటామారి మాగరాజు ౩౫ సదాశివరాయలు ౪౦ అటుతర్వాతను అశ్వపతులు యేలిరి.

ఆదిని మీజా౯ ౪ం సులతాను ౪౮ బాట్లమల్కా ౫ ముక్కంట్టి ముల్కా౪౦ విభురాం ౪౫ ఖుతుపుశా ౫౮ సులతానబ్దుల్లా ౫౫ తానేశా ౧౨ సంవత్సరములు వీరు యీ రాజ్యములు యేలినారు. భావనగరం యీరాజ్యాలు యేలెను. అపురంగ్గు యేలెను. యేడు సంవత్సరాలు విజాపురి సాధించ్చి అల్లియేడుఖాను యాడాది గోలకొండ్డ సాధించ్చి తానీశాను పట్టుకపొయెను. రాయలవారికి గజపతివారికి దశపరం లేదాయను. రాజ్యాలు అవురంగ్గువారికే భవు పన్ను పాచావు అనిరి. యీవెన్కరాజులను దస్తరం శిద్దంన్న అక్కంన్న మాదంన్నగారి మేనల్లుడు వ్రాయించ్చిన ప్రకారము-పూర్వవృత్తాంతము.

స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవర్షంబ్బులు ౧౨౫౦ (1328 AD) అగునేటి నలనామసంవ్వత్సరముకు జయిన నాగదేవభట్టువాశ్ని దండ్డకవిలె ప్రకారము-యీ ప్రకారం రుద్రుడు యేలుబడి వృత్తాంత్తము యీ పతాపరుద్రుడు త్రినేత్రుడు గన్కు ముక్కంట్టి అనిరి. రుద్రహంశ గన్కును కనుప్రతాపరుద్రుడనినారు గనుకను ప్రతాపరు-డనిరి. యీప్రతాప రుద్రుడు ధరణికోట బెట్టించి యీధరణికోట కాడ కాపురంవుండ్డి యీ కొండ్డవీటి శీమలు ౧౪ యీకొండ్డవీటి కింద్దను చెల్లెశీమలు అద్దంకిశీమ గ్రామాలు ౫౫ అమ్మునమోలు ౫౫ కంద్దుకూరు శీమగ్రామాలు ౬౫ నెల్లూరు శీమ గ్రామాదులు ౫ం వుదయగిరిశీమ ౮౦ చుండ్డిశీమ ౪౪ పొదిలె శీమ ౬౬ కూరెడ్లశీమ కొటిశీమ ౬౦ దూపాటిశీమ 3౬ం నాగాజు౯నకొండ్డ శీమ ౧౫౦కి మాచెల౯సంత్తు ౬ళ క్కారెంపూడి సంత్తు ౧౪ గురజాలసంత్తు ౧౬ తమ్మురుగోగెళ్ల శీమ ౪౪ పూర్వవృత్తాం త్తం.

స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవర్షంబ్బులు (1328 AD) అగునేటి నలనామ సంవ్వత్సరానకు జయిన నాగదేవభట్టు వాశిన దండ్డకవిలె ప్రకారం కలియుగ ప్రమాణములు ౪౩౨౦౦౦ ప్రతాపరుద్రుడు యేలే వరకు యీభూమి యేలినరాజులు ఆది పరీక్షిత్తు షష్టి వర్షంబులు యేలెను. అటువెన్కను జనమేజయుడు త్రిదశాబ్దంలు యేలెను. ఆవెన్క శంఖశతా నీకులు దశవర్షంబులు యేలిరి. ఆవెన్క భల్లాణరాజు నూటయెను బదినాలుగు సంవ్వత్సరాలు యేలెను. ఆవెన్కను శూద్రక మహారాజు నూటయెనుబది రెండ్డు సంవ్వత్సరంబ్బులు యేలెను. అటువెన్కును విష్ణు వధ౯నుండు యేలెను. నూటయెను బదిమూడు సంవ్వత్సరంబ్బులు-ఆటు వెన్కును చంద్రగుప్త మహారాజు సూటఅరువై యెనిమిది వర్షంబులు యేలెను. అటువెన్కు ను విక్రమార్కుండును రెండు వేల యెండ్లు యేలెను. అటువెన్క శాలివాహనుండు పంచ వింశతి వర్షంబ్బులు యేలెను. అటువెన్కును భోజరాజు నూటయెనిమిది సంవ్వత్సరంబులు యేలెను. అటువెన్కును మాధవవర్మ నూటయిరువది యేను సంవ్వత్సరంబ్బులు యేలి చినుకు తమెత్తు కనక వర్షం కురియించ్చెను. బెజవాడకు అటువెన్క కోటకేతమహారాజు నూటయిరువై వర్షంబులు యేలెను. అటువెనుకను నీలకంఠమహారాజు నూటముప్పై ఆయనంబ్బులు యేలెను.