పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

గ్రామ కైఫియత్తులు


వర్షం ఆంద్దురు. యిది నవఖండాలు యీభరతఖండమందు వుంన్న పుణ్యనదులు గంగ్గయు, తుంగభద్రయు, వేత్రావతియు, కష్ణావేణియు, బీమనీధియు, మలినాపహారియు, శారావతియు, చంద్రోభాగయు, చెంన్నయు, యమునయు, దమనయు, రేవయు, కావేరియు, గోదావరియు, నర్మదయు, బాహుదయు, గండకియు, సరయు, ప్రసూతయు, సరస్వతియు, శతద్రుతియు, వితన్తయు, విపాశయు, తామ్రపర్ణియు, నేకామరయు, మొదలుగా గల పుణ్యనదులు అనేకంబులు గలవు కుల పర్వతంబ్బులు యేడు గలవు. వాటినామములు మలయ పర్వతం, శక్తివంతం వింధ్యపర్వతం, పూరియాత్ర పర్వతం, మహేంద్ర పర్వతం, మహేంద్ర పర్వతం, సిహ్వగిరి పర్వతం, ఇవియేడు సప్తకుల పర్వతములు పర్వత్తం మరియు అనేక పర్వత్తంబ్బులు గలవు. యీ భరత ఖండమందునను భట్టుద్ని దేశంబులు గలవు. వాటినామాంక్కతంబులు పాంచ్చాలి, బబ్బర, మత్య, మగధ, మంగళ, కుళింగ, కుకుమ, కొంక్కణ, త్రికర్త, సాముద్ర, సాల్వ, సూరసేన, సుధేష్ణ, సుంహ్వక, కురూకూరుశ, గౌళ, కౌసల, యవన, సుగంధర, పాండ్రు, శింధు, భేళి, పుళింద్ర, పుండ్రక, పాంఢ్య, ఆభుర, సౌవిద, సౌరాష్ట్ర, మహరాష్ట్ర, విదేహ, విదర్భ, ద్రౌవిశ, దశార్ణవ, కర్ణాట, అంగ, వంగ, మరాట, పరాట, వాట, భోట బ్రాంప్టోహిక బమాధాన, కిరాత, కేకయ, ఆశ్మంతక, గాంధారా, కాంభోజ, కేరళ, కాశ్మీర, భార్జిర, కుంతల, అవంతి, యివి చప్పంన్న దేశంబులు గలవు. యీజంబూ ద్వీపం ఆరుగురు చక్రవర్తులు. పదహారుగురు రాజులు యేలిరి. యీజంబూద్వీపమకంటేను రెట్టియై వకటి కూకటి ధనధాన్య సంపదలు గలిగి వుండును. సప్తద్వీపంబులు లవణా ఇక్షు సురాసర్పిద ధీక్షిర శుద్ధోదకంబులనెడి సప్త సముద్రంబులు, ద్వీపాలు జంబూద్వీప, ప్లక్షద్వీప, శాల్మలద్వీప, కుశద్వీప, కుశల ద్వీప, క్రౌంచద్వీప, శాఖద్వీప, పుష్కరద్వీపంబులు పయిన ఆరు ద్వీపాలు రెట్టియై ఒక టొక్కటిక్కంటె సస్యసంపదలు కలిగి వుండును. యీజంబూ ద్వీపముకు చుట్టు వలయంబందివలె వుండును. యీరీతిన భూనిన౯యం జంబ్బూ ద్వీపంబు మహమ్మేరుపు భూమధ్యమందున కేతుమాలతషణా నిడుపు ౧౬౧౫౦ యోజనంబుల వెడల్పు ౩౨౧౫౦ యోజనంబులు శ్వేతువు... శృంగవరం శ్వేత పర్వతం-హేమకూటం నిషిద పర్వతం హిమవంతం భద్రాశ్వక వర్షం; నిడుపు ౧౬౫యోజనంబులు వెడల్పు ౩౨౧౫౦ యోజనంబు లున్ను యిలావృతవర్షం నిడుపు ౩౨౩౦౦ వెడల్పు ౩౨౧౫౦ మేరువు హేమ ౧౬౦౦ జయన నాగ భొట్టువాశ్ని శీమామూలదండ కవిలె ప్రకారం కలియుగప్రవేశం ప్రభవ సంవత్సర చైత్ర శు ౧ నాడు ౧౩ ఘడియలు మీదటను యీభూమి యేలికెరాజులు దర్శప్రతి పాలనంయేలినరాజులు ముక్కంటి గనకను పరీక్షిత్తు మహారాజు ౬౦ జనమేజనయుడు ౫౦ శంఖశతానీకులు ౧౦ వీరుపాండు సంతితి నూరు సంవ్వత్సరంబులు యేలిరి. అటుతర్వాతను అంబరీష మహారాజు ౨౫౦ సంవత్సరములు యేలెను. భల్లాణరాజు ౧౮౪ శూద్రక మహారాజు ౧౮౨ విష్ణువర్ధనుడు ౧౮౩ చంద్రగు ప్తవ హారాజు ౧౮౧ తెనుగు గిజ్జడు ౧౦౦ యుధిష్ఠిర శకవత్సరంబులు ౧౮౧౮౦ సంవ్వత్సరములు నడిచినవి. అటుతర్వాతను విక్రమార్క శక వర్షంబులు ౨౦౦౦ ఆటుతర్వాతను శాలివాహన శకవర్షంబులు అయిన యీ శాలివాహనుడు పంచ్చమీ శాబ్దంబులు యేలెను. ౨౫ భోజరాజు ౧౦౮ అగునేటి వెన్క - వగిధనవర్మ అబ్జంబులు ౧౨౫ కోటి కేతు మహారాజు ౧౨౦ నీలకంఠమహారాజు ౧౩౦ భోజరాజు ౧౨౦ యవన భోజుడు ప్రతాపరుద్రుడు యీ ముక్కంటి నుంచి ధర్మపరిపాలను లేవాయెను. యుగ