పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

గారపాడు

కైఫియ్యత్తు మౌజే గారపాడు, సంతు గుంట్టూరు, సర్కారు

ముత్తు౯ జాంన్నగరు తాలూకే, రాచూరు.

యీ గ్రామాన్కు పూర్వంనుంచ్చిన్ని గారపాడు అనే పేరు పుంన్నది. పూర్వం గోపరాజు రామంన్నగారు బ్రాంహ్మణుల్కు గ్రామమిరాశీలు వాయించ్చి యిచ్చెయడల యీగ్రామాన్కు ప్రధములు భారద్వాజ గోత్బులయ్ని వార్కి యిచ్చినారు.

రెడ్లు ప్రభుత్వం చేశేటప్పుడు వారితాల్కు అధికారులు రాచకొండ సూర్యనారాయణ సోమయాజులు వారు బహుతపః సంపంన్నులుంన్ను బ్రహ్మ విద్వాంసులుంన్ను ఆయివుంద్దురుగన్కు యీ గారపాడు వీర్కి అగ్రహారం యిచ్చినారుగన్కు పయ్ని వాశ్ని సూర్యనారాయణ సోమ యాజులు కుటుంబ్బయుక్తముగా అగ్నిహోత్రములతో కూడా యీగ్రామంలో ప్రవేశించ్చి గృహనిర్మాణములు చెస్కుని అగ్రహారం అనుభవిస్తూ యాగాద్యనుష్ఠాది సత్క్రియలు జర్పుకుంటూ బ్రాంహ్మణుల్కు అన్నదానం చేస్తూ సూర్యనారాయణ సోమయాజులు వీరికొమారులయ్ని తిరుమల సోమయాజులు వీరికొమారులయ్ని సూరి సోమయాజులు వీరి ఆత్మజులు వీరేశ్వర సోమయాజులు వీరిసుతులు తిరుమల సోమయాజులు వారివర్కు రెడ్డి వడ్డే కనా౯ట్క ప్రభుత్వములు శా౧౫౦౦శకం (1578 A.D) వరకు అనుభవించినారు. అంత్తట మొగలాయీ ప్రభుత్వంవచ్చె గన్కు కొండ్డవీటి శీమ సముతు బంద్దీలు చేసే యడల యీ గ్రామం గుంట్టూరు సముతులో దాఖలు చేసినారు గన్కు ఆదినములలో పయ్ని వాశ్ని తిరుకుల సోమయాజులు కొడ్కు అయ్ని యజ్ఞనారాయణ సోమయాజులు లౌకికములయంద్దు ప్రవీణులై వుంద్దురు గన్కు హయిదరాబాదు పరయంత్తరంవెళ్లి, మల్కి విధురాహిము మొదలయ్ని పాదుశహాలవారి తాలూకు వ్యవహారస్తులను అనుసరించ్చి సనదు తెచ్చుకొని యజ్ఞనారాయణ సోమయాజులు వీరికొమారు లయ్ని తిరుమల సోమయాజులు మొగలాయి అమలు, స్న౧౧౨౧ ఫసలీ (1711 A. D.) వర్కు అనుభవించ్చినారు.

స్న ౧౧౨౨ (1712) A.D. ఫసలీలో కొండ్డవీటిశీమ జమీదాల౯కు మూడువంట్లు చేశి పంచ్చిపెట్టే యడల యీగ్రామం రమణయ్య మాణిక్యారాయునింగారి వంత్తువచ్చిన రేపల్లె తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు రమణయ్యా మాణిక్యారాయునింగారు ప్రభుత్వంచేస్తూ గార పాటి అగ్రహారాన్ని సాలు౧కి పంన్నులు ౫వరహాల చొప్పున శ్రోత్రియం నిన౯యించ్చి పయ్ని వాశ్ని తిరుమల సోమయాజులు గార్కి యిచ్చిన వారై రమణయ్యగారు, మల్లంన్న గారు, శీతన్నగారు, గోపన్నగారు, జంగన్నగారు స్న౧౧౮౨ ఫసలీ (1772 A.D.) వరకు నడపించ్చిరిగన్కు క్రిష్ణసోమయాజులు అనుభవిస్తూ గ్రామాన్కూతూపు౯భాగమంద్దు శివ స్తలం కట్టించి గంగాధరస్వామివారనే లింగ్డమూత్తి౯ని ప్రతిష్ట చేశి నిత్యనైవేద్య దీపారాధనల్కు కు౧మాన్యం యిచ్చి యీశివాలయాన్కి దక్షిణభాగమంద్దు దిద్దలం కట్టించి శ్రీ ఆంజ