పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రత్తిపాడు

101


స్వస్తిశ్రీ శకవరుషంఖ్బులు ౧౧౪౪ (1222 A. D.) అగు నేటి చైత్రశు ౧౦ సోమవారమునాడు స్వస్తి సమథి గత పంచమహా శబ్దమహా మండ్డలేశ్వర రిపుపుర త్రిపురమహేశ్వర విరజాపురి పురవరేశ్వర దుబ౯య కువాచల మృగేంద్ర సత్యహరిశ్చంద్ర కృష్ణవేణ్యా నది దక్షిణ షట్చ (ట్స) హస్త్ర వనివల్లభ వీరమా హెశ్వర కొలిపాక పురవరేశ్వర మల్లికా వల్లభ చన్నకామోద కుంత్త కొంత్తయ కుంభికామిత్ర వీరముఖ దవ౯ణ విబుద సంత్తప౯ణ శీరమువారి దినపోషణ విద్వధర భోగపురంద్దర పతిమెచ్చుగండ్డ పతివంతాభరణ చోడకటక వబ్రప్రాకార కట్టకల కరద్రిపాలక చాళుక్య రాజ్యమంద్దిర మూల స్తంభ విజయలక్ష్మీపరి రంభణోత్సకులయ్ని శ్రీ మన్మహామండలేశ్వర పరిచ్ఛేద కుసుమరాజులు గండ్డేశ్వర శ్రీ మహదేవర ప్రతిష్ఠ చేసి తమ కులపత్ని ఆయ్ని సఖ్యమదేవులకు ధర్మాధ౯ముగాను నెవళ్ళ చెరువు వెనక మరతు ౧ ని నైవేద్యానకుయి స్తిమి. స్వదత్తం పరదత్తంవాయోహరెతి వసుంధర షష్ఠివ౯ష౯ సహస్రాణి విష్ణాయాం జాయతే క్రీ. మీ. అని యీ ప్రకారంగా శాసన స్తంభం మీద లిఖింప చేసినారు. శాలివాహనం ౧౨౪౦ (1318 A. D.) శకం వర్కు కుమార కాకతియ్య రుద్రదేవ మహారాజుల వారి ప్రభుత్వం జరిగిన తరువాతను రెడ్లు ప్రభుత్వానకు వచ్చి రాజ్యంచేశేటప్పుడు యీ స్తలంలో వారికి రాజబంధువుడయ్ని కురుగంట్టి వెంక్కటరెడ్డిగారి పరంచేశిరిగన్కు అతను ప్రభుత్వం చెస్తూ పైనవాశ్ని శ్రీ గుండ్లేశ్వరస్వామివార్కి పూర్వీకమయిన వృత్తులు జరిగించి సకలోత్సవములు జరిగించినవారై తదనంతరం గ్రామమధ్యమందు విష్ణుస్తళంకట్టించ్చి శాలివాహనం ౧౨౮౬ (1364 AD.) శకమందు శ్రీ వేణుగోపాలస్వామివారిని ప్రతిష్ఠ చేశి సకలోత్సవములు జరుగగలందులకు విశేషమయిన వృత్తి స్వాస్త్యములు కల్పన చేశిరి. శాలివాహనం ౧౨౪౨ (1320 A. D.) శకం లగాయతు ౧౩౪౨ (1420 A. D.) శకం వర్కు రెడ్లు ప్రభుత్వంచేస్ని తర్వాతను గజపతివారు ప్రభుత్వానకు వచ్చి ౧౪౩౭ (1515 A. D) శకం వర్కు ప్రభుత్వంచేస్తూ వుండగా నరపతి శింహ్వాసనాధీశ్వరుడయ్ని కృష్ణదేవరాయు తూర్పుద్విగ్విజయయాత్రకు విచ్చేసి సదరహీ యీశకమండు గజపతివారిని జయించి కొండవీటి దుగ౯ం పుచ్చుకొని విద్యానగరానకు వెళ్ళి రత్నశింహ్వాసనాశీనుడై పృధ్వీరాజ్యం చేయుచుండగాను అయ్యపరుచయ్య వారు కొండవీటి శింహ్వాసనమందు వుండి ప్రభుత్వం చేశేకాలమందు స్వస్తిశ్రీ శకవరుషంబ్బులు ౧౪౫౦ (1528 A.D) అగునేటి సర్వధారినామ సంవత్సర మాఖ శు ౧౫ గురువారం గండ్డేశ్వర శ్రీమహాదేవున్కి దక్షణముఖం భద్రము నింజువల్లిని అచ్చినాయుడు తమతల్లి చిట్టెమ్మ కున్ను తమతండ్రి పోతునా యుడికింన్ని పుణ్యముగా కట్టించెను. తత్పూర్వము గజపతివారు ప్రభుత్వముచేశేటప్పుడు శాలివాహనశకం ౧౪౩౫ (1515 AD) అగునేటి శీముఖ నామసంవత్సరము శ్రావణ బ ౧౩ శుక్రవారం గండ్డేశ్వర మహాదేవునిగుడికింన్ని మంటపమునకున్ను గింజుపల్లి అన్నమనాయకుడుగారు తన తల్లి దండ్రులు పోతునాయుడు చిట్టెమ్మగారికి ధర్మార్థముగాను సున్నంపని చేయించెను. సదరహి కృష్ణరాయులు అచ్యుతరాయులుగారి ప్రభుత్వములు జరిగిన తరువాతను సదాశివ దేవరాయలు ప్రభుత్వములో స్వస్తిశ్రీ శకవరుషంబులు ౧౪౭౬ (1554 AD) అగునేటి ఆనంద నామ సంవత్సర శ్రావణ శుద్ద ౪ గురువారం వరకు తత్పూర్వము పార్వతీదేవి విగ్రహం శిధిలమైపోయివుండగా యీదినం శ్రీపత్తిపాటి గండ్డేశ్వర శ్రీమన్మహదేవునికి పార్వతీదేవిని చేశి తమతల్లి యల్లమ్మకున్ను తండ్రి నాగాబత్తునికిన్ని పుణ్యముగాను తుమ్మపూడి చిట్టాబత్తుడు సమపి౯ంచెను పయ్ని వాశ్ని సదాశివరాయలు రామ