పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

ప్రత్తిపాడు

కై ఫియ్యతు కనుబె ప్రత్తిపాడు సర్కారు మృత్తు౯ జాంన్నగరు

తాలూకే చిల్కలూరుపాడు యిలాకే రాజా మానూరి వెంకట

కృష్ణారావు మజ్ముయదారు,

పూర్వం యీ స్తలం అరణ్యంగ్గావుండుగనుక గౌతమముని యీ స్తలమంద్దు కొంన్ని దినములు తపస్సు చేశి శివలింగ్గ ప్రతిష చేసినాడు. తదనంత్తరం విదభ౯ దేశపురాజు కుమాతే౯ అయ్ని శీమంత్తిని భత్త౯ నాగకొమారులచాత పట్టుబడి నాగలోకమునకు పాయగనుక యీ సంగతి విన్నదై అంతఃపురము వదిలి యీ అరణ్యానకు వచ్చి యీఆశ్రమమందువుంన్న షువంటి లింగమూత్తి౯ని గురించి చాలా ప్రాధ౯నచేశేవర్కు ప్రసన్నుడై ఆరాజశ్రీ యొక్క భర్త సన్నిహితమయ్యెటట్టు కరుణించినారు గనుక ఆరాజకొమాతే౯ తన పెనిమిటియొక్క గండం గడిపినందున యీదేవునికి గండేశ్వరుడని నామం యేప౯రచి బహుశా పూజించినది గన్కు తదారభ్యా ఆదేమునికి గండేశ్వరుడనే వాడికె వున్నది. ఆదినములలోనే యీ స్తలం భక్తులవాడ అనే నామం వహించెను. తదనంతరం కలియుగ ప్రవేశమయ్ని తర్వాతను యీలింగ్డమూత్తి౯ దృశ్యం కాకుండా వుండెను. మరికొంన్ని సంవత్సరములకు యీప్రదేశమందు గ్రామం యేప౯డి పూర్వంభక్తులవాడ గనుక యేతత్ప్రతినామధేయం ప్రత్తిపాడు అని అభిదానం యేర్పడ్డది.

గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతిదేవ మహారాజులు ప్రభుత్వంచేశేటప్పుడు వీరిదగ్గర ప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శాలివాహనం ౧౦౬౭ శకమందు బ్రాహ్మణులకు గ్రామమిరాశీలు నిన౯యం చేశేయడల యీపత్తిపాట్కి పరాశర గోత్రులయ్ని తోకచుచ్చు వారి సంప్రతి ౧ ఆత్రేయ గోతులయ్ని పత్తిపాటివారి సంప్రతి ౧ పరాశర గోత్రులయ్ని యేలూరివారి సంప్రతి ౧ భారద్వాజ గోతులయ్ని పింగ్గళివారి సంప్రతి ౧ వెరశినాల్గు సంప్రతులవార్కి మిరాశి యిచ్చినారు గన్కు యిదివర్కు అనుభవిస్తూ వుంన్నారు.

తదనంతరం కావిసాక పురాధీశుడైనషువంటి పరభేదకుసుమరాజు సైన్యసమేతంగ్గా చోడదేశాన్కి జయాధి౯యైవెళ్లి అక్కడిరాజుల జయించి తిరిగి నిజదేశానకు వెళ్లుతూ యీ స్తలాన్కు వచ్చి నివశించ్చివుండగా పూర్వం వల్మీక ప్రవిష్టులై వుంన్న గండ్డేశ్వర స్వామివారు ఆ రాత్రి రాజుకలలోవచ్చి పూర్వం రుషి చాత ప్రతిష చాయబడి తదనంత్తరం శీమంత్తిని అనే రాజకొమత్తె౯యొక్క గండం గడిపి బహుమంది భక్తుల చాతను పూజవడశి కాలంత్తరవస్థ చాతను వాల్మీక ప్రతిషుడనై వుంన్నాను. నన్ను ప్రతిష చాయమని ఆనతిచ్చి తనువుంన్న స్తల మంన్ను చెప్పిరిగన్కు మరునాడు పరిఛేద కుసుమరాజు మంత్రి సామంత సేనాధ్యక్ష సమేతంగ్గా ఆవల్మీకం దగ్గరకువెళ్ళి శోధన చేయగా దృష్ట్యమాయగన్కు చాలాసంత్తుషించ్చి ఆస్థలమంద్దే ఆలయం కట్టించ్చి ప్రాకార మంట్టపములు నిమ్మా౯ణం చేయించ్చి ఆ గండ్లేశ్వరస్వామి వార్ని పునఃప్రతిష్ఠ చేశినాడు. యింద్కు శాసనం: