పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

95

తుల౯పాడు

కయిఫియ్యతు మౌజేతుల౯పాడు, ముఠేవేలూరు, సంతునాదేండ్ల,

సర్కారు మృతు౯జాంన్నగరు తాలూకే చింత్తపల్లి, యీలాకే

రాజావాశిరెడ్డి వెంక్కటాద్రినాయుడు బహద్దరు మన్నెసుల్తాను.

ఈ గ్రామాన్కు పూర్వంనుంచ్చింన్ని తుల పాడు అనే పేరు వుంన్నది. గజపతి సింహ్వసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు ప్రభుత్వం చేశేటప్పుడు యీ గ్రామాన్కు సదరహి గణపతిరాజుగారి మహాప్రధానులయ్ని గోపరాజు రామన్నగారు శా ౧౦౭౭ శక (1155 AD) మందు సమస్తమయిన నియ్యోగులకు గ్రామకరణీకపు మిరాశీలు నిన౯ యించే యడల యీ గ్రామాన్కు వెలనాడు సంప్రతులు ౨కి భారద్వాజ గోత్బలయిన తుల౯పాటివారి సంప్రతి కౌండస్యస గోత్బలయ్ని వెళ్లూరివారి సంప్రతి వెరశి రెండు సంప్రతులవారికి గ్రామకరణీకపు మిరాశీలు నిన౯యించినారు. తదాది మొదలుకొని ఆయొక్క వంశీకులు కరణీకములు అనుభవిస్తూ వున్నారు.

శా ౧౧౬౦ శకం (1238 A. D.) మొదలు కాకతీయ్య రుద్రదేవ మహారాజులుంగారు ప్రభుత్వం చేస్తూవుండి యీ గ్రామమంద్దు శివస్థలం కట్టించ్చి శ్రీ పాండులింగ్గేశ్వరుడనే లింగమూర్తిని ప్రతిష్ట చేశి మరింన్ని యీ గ్రామమంద్దు విష్ణుస్థలం కట్టించ్చి చన్నకేశవ స్వామివారిని ప్రతిష్ఠ చేసి వుభయ దేవస్థానముల్కు విశేషములుగానే వుత్సవాదులు నిత్య నైవేద్య దీపారాధనలు జరుగగలండ్లుకు వృత్తి స్వాస్యములు జరిగించినారు. వడ్డే రెడ్డి కన్నా౯టకముయొక్క ప్రభుత్వములు. శా ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జరిగిన తరువాతను తుర్కాణ్యం పబ్రల మాయ గన్కు కొండవీటిశీమ సముతు బందీలు చేశే టప్పుడు యీ గ్రామం నాదెండ్ల సముతులో దాఖలు చేసి సముతు అమలు చౌదరు, దేశ పాండ్యాల పరంగ్గా మల్కి విభురాం పాదుశహావారి ఆములు లగాయతు, అలంగ్లీరు పాదుశహా వారి అములు వర్కు అమాని మామలియ్యతు జరిగించ్చినారు - స్న ౧౧౨౨ ఫసలీలో (1712 AD) సుభావారు కొండవీటిసీమ జమీన్దారులు అయిన మాసూరి వెంక్కంన్న పంతులు గారి వంట్టులో వచ్చి చిల్కలూరిపాటి తాలూకాలో దాఖలు అయ్నినది గన్కు వెంక్కంన్న పంతులుగారు ప్రభుత్వంచేస్తూ అధి౯ తోందరను గురించి యీ గ్రామం యేలూరు సముతు తొమ్మిది గ్రామాదులు ముఠాచేసి యేలూరు ముఠా అని పేరు పెట్టి చింతపల్లి తాలూకా జమీదారులయిన వాసిరెడ్డి పద్మనాభునిగారు, చంద్రమౌళిగారు. రామలింగన్నగారు. నరసన్నగారు, సూరన్నగారు, చిననరసన్నగారు, చినరామలింగన్నగారు, జగయ్యగారు, రామన్నగారు ప్రభుత్సములు జరిగిన తర్వాతను పయిని వాశ్ని జగయ్యగారి కొమారులయిన రాజా వెంకటాద్రి నాయుడుగారు ప్రభుత్వం వహించి స్న ౧౨౨౨ ఫసలీ (1812 AD) వర్కు ప్రభుత్వం చేస్తూవున్నారు.