పుట:Endaro Wikimedianlu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపసంహారం

ఇదంతా వికీమీడియన్ల కీర్తిగానం లాగా వినిపించి ఉండవచ్చు. అందరూ మహామహులేనా అసలు ఏ దోషాలూ లేని ఏ తప్పూ చెయ్యని అసామాన్యులా అని అనకండి. మేం రోజూ వికీల్లో మా మా తప్పుల్నే ఎంచుకుంటూంటాం. తెగేదాకా లాక్కుంటూంటాం. తెగేవేళకు మాలోనే ఎవరో ఒక మర్యాద రామన్న వచ్చి ఇక ఆపండి. ఇద్దరిదీ తప్పే, ఇలా చేద్దాం అని సర్దిచెబుతాడు. తప్పు దిద్దుకుంటాం. ఆ మేరకు వ్యాసం బాగుపడుతుంది. గొప్పలు చెప్పుకునే ఆవకాశం ఎలాగూ ఉండదు అక్కడ. అందుకే.., గొప్పతనాలను చెప్పుకునేందుకే ఈ పుస్తకం!

ఎవర్రాసారివి? ఎందరో మహానుభావులు -అందరికీ మా వందనాలు!

వీరేనా వికీవీరులు. ఇంకెవరూ లేరా? ఎందుకు లేరూ... ఉన్నారు. వికీలో కృషి చేస్తున్న మౌనమునులు, అన్‌సంగ్ హీరోలు ఎందరో ఉన్నారు. వారి గురించి కూడా చెప్పాలి, చెబుతాం. ఇది మొదలు మాత్రమే. ముందుముందు మరిన్ని చిరుచిత్రాలు వస్తాయి. మరెందరో గొప్ప వికీపీడియన్లు వస్తారు. ఇకనుండి ఏటా పుస్తకం వేస్తాం. మరిన్ని విశేషాలు తెస్తాం. అప్పటివరకూ...

నమస్కారం.


ఎందరో వికీమీడియన్లు

85